క్షమాపణలు చెబుతా.. 40 నిమిషాల పాటు కౌశిక్‌రెడ్డి విచారణ

మహిళా కమిషన్‌ ఎదుట హాజరు విధాత, హైదరాబాద్‌: జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పిన కౌశిక్‌రెడ్డి.. గవర్నర్‌కు లిఖిత పూర్వక క్షమాపణలు చెబుతానని కమిషన్‌కు తెలిపారు. క్షమాపణ ప‌త్రం మహిళా కమిషన్‌కు పంపుతానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన […]

క్షమాపణలు చెబుతా.. 40 నిమిషాల పాటు కౌశిక్‌రెడ్డి విచారణ

మహిళా కమిషన్‌ ఎదుట హాజరు

విధాత, హైదరాబాద్‌: జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పిన కౌశిక్‌రెడ్డి.. గవర్నర్‌కు లిఖిత పూర్వక క్షమాపణలు చెబుతానని కమిషన్‌కు తెలిపారు. క్షమాపణ ప‌త్రం మహిళా కమిషన్‌కు పంపుతానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

నోటీసులు జారీ చేసిన మ‌హిళా క‌మిష‌న్‌

ఇదిలా ఉండగా.. గత నెలలో జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ తమిళిసైని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఇప్పటిదాకా దాచుకున్నారంటూ అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు.

ఓ మహిళా గవర్నర్ అని చూడకుండా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ నెల 14న జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

ముగిసిన విచార‌ణ‌

మహిళా కమిషన్‌లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి విచారణ ముగిసింది. జాతీయ మహిళా కమిషన్‌ కౌశిక్‌ను 40 నిమిషాల పాటు విచారించింది. గవర్నర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన లిఖితపూర్వకంగా, మౌఖికంగా వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్‌కు ఇచ్చిన వివరణపై హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.