వాకర్‌తో నడుస్తున్న మాజీ సీఎం కేసీఆర్

- నిలకడగా ఆరోగ్యం
విధాత : తన ఫామ్‌హౌజ్‌లో జారిపడటంతో తుంటి ఎముక(హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ) ఆపరేషన్ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోధ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శనివారం వైద్యులు వాకర్ సహాయంతో కేసీఆర్‌ను వైద్యులు కొద్ది సేపు నడిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి.
కేసీఆర్‌ను 8వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. త్వరగా కోలుకునేందుకు వీలుగా అవసరమైన ఎక్సర్‌సైజ్‌లు, ఫిజియో థెరపి చికిత్సలు కూడా అందించనున్నట్లుగా తెలిపారు. కేసీఆర్ వద్ద ఆసుపత్రిలో ఆయన సతీమణి శోభ, కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఒవైసీ ఆసుపత్రికి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించారు.