స్లీవ్ లెస్‌గా.. కీర్తి సురేష్‌లో కొత్త యాంగిల్!

విధాత‌: కీర్తి సురేష్….ఈమెను నేటి జనరేషన్‌లో మహానటి అని పిలుచుకుంటున్నారు. నేటి త‌రం కూడా ఆమెను మహానటి‌గానే గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే వారికి బహుశా సావిత్రి గురించి తెలియకపోయి ఉండవచ్చు. అందులో వారి తప్పు ఏమీ లేదు. సావిత్రి ఇలా ఉంటుందా? ఆమె గొప్పతనం ఇదా..! ఆమె ఇలా చేసి ఉంటుందా? అని అందరికీ ఒక ఫీల్ ని కలిగించి…. సావిత్రి గురించి తెలిసిన వారికి సావిత్రి గురించి తెలియని వారికి కూడా తెలియజెప్పిన మహానటి కీర్తి సురేష్. […]

స్లీవ్ లెస్‌గా.. కీర్తి సురేష్‌లో కొత్త యాంగిల్!

విధాత‌: కీర్తి సురేష్….ఈమెను నేటి జనరేషన్‌లో మహానటి అని పిలుచుకుంటున్నారు. నేటి త‌రం కూడా ఆమెను మహానటి‌గానే గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే వారికి బహుశా సావిత్రి గురించి తెలియకపోయి ఉండవచ్చు. అందులో వారి తప్పు ఏమీ లేదు. సావిత్రి ఇలా ఉంటుందా? ఆమె గొప్పతనం ఇదా..! ఆమె ఇలా చేసి ఉంటుందా? అని అందరికీ ఒక ఫీల్ ని కలిగించి…. సావిత్రి గురించి తెలిసిన వారికి సావిత్రి గురించి తెలియని వారికి కూడా తెలియజెప్పిన మహానటి కీర్తి సురేష్.

ఈ భామకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది. కానీ అది ఆ పాత్రకు సరిపోదేమో! కీర్తి సురేష్‌ని ఇప్పటిదాకా మనం నిండుగా ఒంటినిండా బట్టలతో.. ఒక నటన ప్రతిభ ఉన్న నటిగానే చూశాం. కానీ తాజాగా ఆమెలోని కొత్త యాంగిల్ బయటకు వచ్చింది.

ల‌వ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె తనలో హాట్‌నెస్‌ కూడా దాగి ఉందని గుర్తు చేసింది. సోషల్ మీడియా వేదికగా సొగసులతో సెగలు రేపుతోంది. కీర్తి గ్లామర్ యాంగిల్ కిక్ ఇస్తుండగా.. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా కీర్తి స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి హోయల‌ సొగసులు పోయింది.

ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఈమెకు రెండు హిట్స్ ఉన్నాయి. మహేష్ కు జోడిగా నటించిన సర్కారు వారి పాట హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కీర్తి ఒక డిఫరెంట్ పాత్ర చేసింది. కీర్తి రోల్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది.

అలాగే ఓటిటిలో కూడా ఆమెకు ఓ హిట్టు ఉంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సాన్ని కాయితం హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం చిన్ని టైటిల్తో స్ట్రీమ్ అయింది. ప్రస్తుతం ఆమె నాలుగు చిత్రాలు చేస్తోంది.

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నానికి జంటగా ‘దసరా’ మూవీలో నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా రూపొందుతోంది. వెన్నెల అనే డి గ్లామ‌ర్ రోల్ చేస్తుంది కీర్తి. ఇక చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో ఆమెది చిరు చెల్లిగా కనిపించే కీలక పాత్ర. ఒకపక్క స్టార్స్ తో జోడిగా నటిస్తూనే మరోవైపు చిరుకు చెల్లిగా చేయడం నిజంగా సాహ‌స‌మే. ఎందుకంటే చెల్లెలి పాత్ర‌లు చేస్తే హీరోయిన్ అవకాశాలు రావని ఒక సెంటిమెంట్ సినిమా ఫీల్డ్‌లో ఉంది.

కీర్తి మాత్రం వాటిని లెక్క చేయడం లేదు.. ఫాలో అవ్వడం లేదు. ఆల్రెడీ ఆమె పెద్దన్న మూవీలో రజినీకి చెల్లిగా నటించింది. సినిమాల సంగతి అటుంచితే.. ఈమధ్య కీర్తి పెళ్లి వార్తలు హల్చల్ చేశాయ్. ఆమె త‌ల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి. సో.. వేచి చూద్దాం.. ఏం జరుగుతుందో.. కీర్తి సురేష్ వివాహం చేసుకున్నా కూడా నటిగా ఆమె ప్రతిభకు ఛాన్సులు వస్తూనే ఉంటాయి అనేది కచ్చితంగా చెప్పవచ్చు.