కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ.. హాజరైన సోనియా,రాహుల్
విధాత: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖర్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి గాంధేతర వ్యక్తిగా ఖర్గే రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ నియామక పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఖర్గేకు సోనియా, రాహుల్, ప్రియాంక శుభాకాంక్షలు తెలిపారు. LIVE: Presentation of […]

విధాత: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖర్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి గాంధేతర వ్యక్తిగా ఖర్గే రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ నియామక పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఖర్గేకు సోనియా, రాహుల్, ప్రియాంక శుభాకాంక్షలు తెలిపారు.
LIVE: Presentation of Certificate of election at AICC HQ. https://t.co/iNg3U2tFXw
— Mallikarjun Kharge (@kharge) October 26, 2022
ఖర్గే నాయకత్వంలో ముందుకెళ్తాం: సోనియా
ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అభినందనలు. కొత్త నాయకత్వంలో పార్టీ మరింత ముందుకెళ్తుందని ఆశిస్తున్నా. ఇక ముందు సీనియర్ నాయకుడైన మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ముందుకెళ్తాం. ఖర్గేకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. వాటిని అధిగమించి పార్టీని ముందుకు నడిపించే సమర్థత ఖర్గేకు ఉన్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి అహర్నిశలు పని చేస్తా: ఖర్గే
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు.. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. బాధ్యతల నిర్వహణలో అందరి సహకారం తీసుకుంటాను. కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అ న్నారు. అధికార రాజకీయాల యుగంలో సోనియా నిస్వార్థ త్యాగం అసమానమైందని కొనియాడారు.
ఒక కార్మికుడి కుమారుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత సోనియాకే దక్కుతుందని, సోనియా పదవులను తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తున్నదని, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి అహర్నిశలు పని చేస్తానన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
రాత్రికి హైదరాబాద్ రానున్న రాహుల్
సాయంత్రం రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా మక్తల్ చేరుకుంటారు. రాహుల్ రేపు ఉదయం మక్తల్ నుంచి జోడో యాత్ర ప్రారంభించనున్నారు.