Kiccha Sudeep | బీజేపీలో చేరనున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్..?
Kiccha Sudeep | ప్రముఖ కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌తో పాటు దర్శన్ తూగుదీప భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోని బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో నటీనటులిద్దరు పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది. సమాచారం మేరకు.. ఇద్దరు నటులు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పార్టీ నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఫిబ్రవరి నెలలో కర్ణాటక కాంగ్రెస్ […]

Kiccha Sudeep | ప్రముఖ కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌తో పాటు దర్శన్ తూగుదీప భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోని బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో నటీనటులిద్దరు పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే, దీనిపై ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది. సమాచారం మేరకు.. ఇద్దరు నటులు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పార్టీ నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఫిబ్రవరి నెలలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కిచ్చా సుదీప్‌ని ఆయన ఇంట్లో కలిసిన విషయం తెలిసిందే.
ఈ భేటీ తర్వాత కిచ్చా కాంగ్రెస్‌లో చేరబోతున్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. మే 10న కర్ణాటకలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. 13న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సారి రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ సాధించాలని పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కిచ్చా సుదీప్‌కు కర్ణాటకలో భారీగా ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఈ నేపథ్యంలో సుదీప్ చేరికతో పార్టీకి మరింత కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తున్నది.