Komati Reddy Venkat Reddy
విధాత: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ ఆదివారం హైదరాబాదులో కోమటిరెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ లో జూపల్లి, పొంగులేటిల చేరిక పై ఈ సందర్భంగా వారంతా చర్చించినట్లుగా సమాచారం. భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి, జూపల్లి సహా గతంలో కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేరకు వారందరిని తాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని తను కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తధ్యమన్నారు. కాగా భేటీ వివరాలను జూపల్లి, పొంగులేటిలు మీడియాకు బహిర్గతం చేయలేదు.