Komatireddy | సాగుకు 15 గంటల విద్యుత్తు చూపితే రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సిద్ధిపేటలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ కాంగ్రెస్‌పై కాదు.. కేసీఆర్‌పైనే నాకు అసంతృప్తి Komatireddy | విధాత: సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎక్కడైనా వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్ రావుకి సవాల్ చేస్తున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు అంతా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఎరువుల కోసం […]

- సిద్ధిపేటలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
- కాంగ్రెస్‌పై కాదు.. కేసీఆర్‌పైనే నాకు అసంతృప్తి
Komatireddy | విధాత: సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎక్కడైనా వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్ రావుకి సవాల్ చేస్తున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు అంతా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
ఎరువుల కోసం రైతులు క్యూ కడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు కోమటిరెడ్డి స్పందిస్తూ నాకు కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి అసంతృప్తి లేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నాకు తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలలో భాగంగా అవసరం అయితే నేను నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీగా ఉన్నానన్నారు.
సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదేదో రాస్తున్నారని,నాకు ఎవరిపై అసంతృప్తి లేదన్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా టికెట్ల కేటాయింపులపై మాట్లాడటానికి ఠాక్రే నా దగ్గరికి వచ్చారని, కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన తరువాత ఎలా ఉంటుందో చూడండన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా నా పని నేను చేస్తానన్నారు. అహంకారం తలకెక్కిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు అవసరమైతే నా ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటానన్నారు.
ఆత్మహత్య యత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్ మరణించడం దురదష్టకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని కోమటిరెడ్డి ఆరోపించారు. రవిందర్ కుటుంబానికి ప్రభుత్వం 25లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలన్నారు. హోంగార్డులను రెగ్యులైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ మాటతప్పారన్నారు. ఈ 17న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు తరలిరావాలని, కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకే సోనియాగాంధీతో ఈ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహిస్తుందన్నారు.
కర్ణాటక తరహాలో తెలంగాణలోను సోనియా గాంధీ ఐదు హామీలపైన ప్రకటన చేస్తారన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని సీఎం కేసీఆర్ గతంలో చెప్పాడని, టీఆరెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆమెకు చెప్పి మోసం చేశాడన్నారు. పార్టీలను, ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు పరిపాటిగా మారిందన్నారు. డబ్బులను నమ్ముకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల వేళ ఎన్నిరకాల బంధు పథకాలు తెచ్చినా ఎన్నికల్లో కేసీఆర్ దుకాణం బంద్ కావడం తధ్యమన్నారు.
దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలన్ని బీఆరెస్ నాయకులే తప్ప పేద ప్రజలకు అందడం లేదన్నారు. ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఎందుకివ్వలేదో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. 50లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. పార్లమెంటు సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుందన్నారు. నేడు బీఆరెస్ ఇచ్చే ఆసరా పింఛన్ కాంగ్రెస్ హాయంలో 400పింఛన్‌తో సమానమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్లను 4వేలకు పెంచి అందిస్తామన్నారు. రైతులకు 2లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు సహాయం అందిస్తామన్నారు.