ఆర్మూర్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో అపశృతి
విధాత : నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు ర్యాలీలో ప్రచార రథానికి డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో రేయిలింగ్ విరిగి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌రెడ్డిలు కిందపడ్డారు. కింద పడిన మంత్రి కేటీఆర్‌ను భద్రాతా సిబ్బంది పట్టుకున్నారు. అయితే ప్రమాదంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి.
కొడంగల్ వెళ్లిన మంత్రి కేటీఆర్
ఆర్మూర్ బీఆరెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో ప్రచార వాహనంపై పడిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదని, ఈ కార్యక్రమం అనంతరం ఇక్కడి నుంచి కొడగంల్ రోడ్ షోలో పాల్గొనేందుకు వెళ్లినట్లుగా కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.