KCR కొడుకు లుచ్చా, లఫంగా.. నన్ను విమర్శించే అర్హత KTRకు లేదు: బండి సంజయ్ ఫైర్

కరెంట్ బిల్లు కట్టలేదని 6 నెలలుగా గిరిజనులను చీకట్లోనే ఉంచుతారా? అయ్య పేరు చెప్పుకుని పదవి తెచ్చుకున్నోడు కేటీఆర్ వర్దన్నపేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కరెంట్ బిల్లులు కట్టలేదనే కారణంతో గత 6 నెలలుగా వర్దన్నపేట డీసీ తండాలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గిరిజనులు పేదోళ్లు. కరెంట్ బిల్లులు కట్టలేదని 6 నెలలుగా డీసీ […]

  • By: krs    latest    Feb 24, 2023 2:33 AM IST
KCR కొడుకు లుచ్చా, లఫంగా.. నన్ను విమర్శించే అర్హత KTRకు లేదు: బండి సంజయ్ ఫైర్
  • కరెంట్ బిల్లు కట్టలేదని 6 నెలలుగా గిరిజనులను చీకట్లోనే ఉంచుతారా?
  • అయ్య పేరు చెప్పుకుని పదవి తెచ్చుకున్నోడు కేటీఆర్
  • వర్దన్నపేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ ఫైర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కరెంట్ బిల్లులు కట్టలేదనే కారణంతో గత 6 నెలలుగా వర్దన్నపేట డీసీ తండాలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

గిరిజనులు పేదోళ్లు. కరెంట్ బిల్లులు కట్టలేదని 6 నెలలుగా డీసీ తండా కరెంట్ కట్ చేస్తారా? గిరిజనులను చీకట్లోనే ఉంచుతారా? కరెంట్ బిల్లు కట్టలేదని వర్దన్నపేట మున్సిపాలిటీలోని డీసీ తండాలోని గిరిజనుల ఇండ్లలో కరెంట్ కట్ చేసిండ్రు.6 నెలలైనా ఇంతవరకు కనెక్షన్ పునరుద్దరించ లేదు.. మహా అంటే 5 నుంచి 10 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉంటే కట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.

‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి వర్దన్న పేటలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు, పేదలంటే అంత చులకనా?’ అంటూ ప్రశ్నించారు.

జిల్లా రైతుల పోరాటం భేష్. రియల్ ఎస్టేట్ కోసం భూములు గుంజుకోవాలనుకున్న ప్రభుత్వం చెంప చెళ్లుమన్పించేలా పోరాటాలు చేశారని అభినందించారు. బీఆర్ఎస్ నేతల భూముల కబ్జాకు, ఇసుక దందాలకు అంతే లేదు. వందల కోట్లు దోచుకుంటున్నరు. రైతుల భూములను లాక్కుంటున్నరు. ప్రశ్నిస్తే బేడీలు వేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. కోనారెడ్డి చెరువు తెగి వరి పొలాలన్నీ మునిగిపోతే కనీసం పైసా పరిహారం కూడా ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్ అంటూ విమర్శించారు.

నన్ను విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదు

కేసీఆర్ కొడుకు లుచ్చా, లఫంగా.. అమెరికాపోయి చిప్పలు కడిగి వచ్చినోడు.. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించుకున్న లుచ్చా. బండి సంజయ్‌ను విమర్శిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలెక్క లంగా పనులు చేయలే.

దేశం, ధర్మం కోసం పోరాడిన. అనేక సార్లు జైలుకు పోయివచ్చినోడు.. నీకు బండి సంజయ్‌ను విమర్శించే అర్హత ఉందా? అంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.