KTR.. క్యా బాత్‌ హై! అసెంబ్లీలో ప్రసంగం.. ఫిదా అవుతున్న జనం

మాస్‌.. క్లాస్‌.. బిజినెస్‌మెన్ ఏదైనా మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే.. విధాత‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాటలకు ఫిదా అవుతున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అందులో వాస్తవాస్తవాల సంగతి పక్కన పెడితే.. ఎనిమిదిన్నర ఏళ్ల తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని అనర్గళంగా వివరించారు. తమ విజయాల గురించి వివరిస్తూనే కేంద్రంపై, వారి విధానాలపై విరుచుకు పడ్డారు. India needs Double Impact Govt and not […]

  • Publish Date - February 6, 2023 / 06:22 PM IST
  • మాస్‌.. క్లాస్‌.. బిజినెస్‌మెన్ ఏదైనా
  • మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే..

విధాత‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాటలకు ఫిదా అవుతున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అందులో వాస్తవాస్తవాల సంగతి పక్కన పెడితే.. ఎనిమిదిన్నర ఏళ్ల తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని అనర్గళంగా వివరించారు. తమ విజయాల గురించి వివరిస్తూనే కేంద్రంపై, వారి విధానాలపై విరుచుకు పడ్డారు.

బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ సభ్యులకు కౌంటర్ ఇస్తూ.. సాగిన ఆయన ప్రసంగం కేసీఆర్‌ను తలపించింది అంటున్నారు. సభలో సభానాయకుడిలా తమ పాలనలో అన్నిశాఖలు సాధించిన విజయాలను వివరించిన తీరు చాలా మందిని ఆకట్టుకున్నది. కేటీఆర్‌ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆయన వాగ్దాటితో అసత్యాలను వినసొంపుగా చెప్పారని విమర్శించారు.