KTR | ఏ ముహం పెట్టుకొని మోదీ తెలంగాణకు వస్తాడు: కేటీఆర్‌

KTR మోదీ సభను బహిష్కరిస్తున్నాం గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు మీడియాతో మంత్రి కేటీఆర్‌ విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముహం పెట్టుకొని తెలంగాణకు వస్తాడని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను వ్యతిరేకించడమే కాకుండా.. తెలంగాణ పట్ల నర నరాన విషం నింపుకున్న వ్యక్తి అని మోదీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ గుజరాత్‌లో రూ.20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తెలంగాణకు […]

  • Publish Date - July 7, 2023 / 02:48 PM IST

KTR

  • మోదీ సభను బహిష్కరిస్తున్నాం
  • గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు
  • మీడియాతో మంత్రి కేటీఆర్‌

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముహం పెట్టుకొని తెలంగాణకు వస్తాడని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను వ్యతిరేకించడమే కాకుండా.. తెలంగాణ పట్ల నర నరాన విషం నింపుకున్న వ్యక్తి అని మోదీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ గుజరాత్‌లో రూ.20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తెలంగాణకు మాత్రం రూ.520 కోట్లతో వ్యాగన్ ఫాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని, తెలంగాణకేమైనా భిక్షం వేస్తున్నారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, బీఆర్‌ఎస్‌ నుంచి శనివారం వరంగల్‌లో ప్రధాని కార్యక్రమానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్‌ ప్రకటించారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరిండని, రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ , బీజేపీ మనిషి అన్నారు. ఆయన ఏనాడూ మోదీని విమర్శించలేదన్నారు.

లంగ పనులు చేసే వాళ్లకు ధరణితో ఇబ్బంది ఉంటుందన్న కేటీఆర్‌ ఎన్డీయే మీటింగ్‌కు బాబు ఎందుకు వెళతారో చెప్పాలన్నారు. గాంధీని ఓ లీడర్‌గా దేశంలో ఎవరు గుర్తించలేదని, రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

రాహుల్‌ ఏమైనా కాంగ్రెస్ అధ్యక్షుడు కాదని, బహురూపు వేషాలు వేస్తే ప్రజలు నమ్మరన్నారు. వచ్చేవారం రోజుల్లో సీఎం కేసీఆర్ మేధావులతో సమావేశం నిర్వహిస్తారని.. కామన్ సివిల్ కోడ్ మీద చర్చ జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.