Telangana Weather Forecast : కొద్ది గంట‌ల్లో హైద‌రాబాద్ తో పాటు ప‌లు జిల్లాల‌కు భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్‌తో పాటు ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. టీజీ ఐసీసీసీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Weather Forecast : కొద్ది గంట‌ల్లో హైద‌రాబాద్ తో పాటు ప‌లు జిల్లాల‌కు భారీ వ‌ర్షాలు

హెచ్చ‌రిక జారీ చేసిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్‌18(విధాత‌): మ‌రో మూడు గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ తోపాటు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ (టీజీ ఐసీసీసీ) తెలిపింది. ఈ మేర‌కు టీజీ ఐసీసీసీ ప్ర‌జ‌ల మొబైల్ ఫోన్ల‌కు స‌మాచారం అందించింది. ముఖ్యంగా హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరిలో చాలా చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది.