• Telugu News
  • /Telangana

Komatireddy Rajgopal Reddy : నాపై సోషల్ మీడియా ప్రచారం నమ్మవద్ధు

ఫేక్ న్యూస్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా పుకార్లు నమ్మవద్దని, కాంగ్రెస్ పట్ల తన విశ్వాసం స్పష్టం చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 18, 2025, 3:12 pm IST
Read Time: 3 mins
Komatireddy Rajgopal Reddy : నాపై సోషల్ మీడియా ప్రచారం నమ్మవద్ధు

విధాత, హైదరాబాద్ : నాకు ఏదో మంత్రి పదవి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించి అబద్దాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని..వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాపై కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో నా ఇమేజ్ తగ్గించే విధంగా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటిసారి గత అసెంబ్లీలో ప్రశ్నించిన వ్యక్తిని నేనే అని..కానీ ఆ ప్రాజెక్టును సమర్థిస్తున్నట్టు ఫేక్ న్యూస్ ను ఏబీఎన్ పేపర్ పేరుతో ప్రచారం చేశారన్నారు. ఈరోజు కూడా గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకు వెళ్తుంటే అక్కడ ఏదో జగన్ ను కలుస్తానని ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

నేనేదో కొత్త పార్టీ పెడుతున్నట్టు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని..నేను ఎంపీగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందానని.. నా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని.. తెలంగాణ ప్రజలు ఫేక్ న్యూస్ ని నమ్మవద్ధని రాజగోపాల్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విషయాలు ఇలా చేస్తే బాగుంటుందని..కొన్ని వేదికల ద్వారా సలహాలు, సూచనలు చేశాననే తప్ప నేను ఎప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.