KVP | కేవీపీ సరికొత్త పాలిటిక్స్.. చంద్రబాబుకు జై కొడుతున్న YSR ఆత్మ

విధాత‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. అది పలుమార్లు రుజువైంది కూడా. ఆనాడు వైఎస్ఆర్ వేసే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే ఆయన ఆత్మ కేవీపీ (KVP) రామచంద్ర రావు ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నారు. ఆరోజుల్లో వైఎస్‌ ఆంటే కేవీపీ అన్నట్లుగా ఉండే ఈయన ఆ తరువాత జగన్ వెంట నడవ లేదు. ఇప్పుడు ఆయన దాదాపు వైఎస్ఆర్ గతించిన దాదాపు 14 ఏళ్ళ తరువాత అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. వైఎస్‌కు […]

  • Publish Date - April 3, 2023 / 07:32 AM IST

విధాత‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. అది పలుమార్లు రుజువైంది కూడా. ఆనాడు వైఎస్ఆర్ వేసే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే ఆయన ఆత్మ కేవీపీ (KVP) రామచంద్ర రావు ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నారు. ఆరోజుల్లో వైఎస్‌ ఆంటే కేవీపీ అన్నట్లుగా ఉండే ఈయన ఆ తరువాత జగన్ వెంట నడవ లేదు.

ఇప్పుడు ఆయన దాదాపు వైఎస్ఆర్ గతించిన దాదాపు 14 ఏళ్ళ తరువాత అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. వైఎస్‌కు రాజకీయ విరోధి అయిన చంద్రబాబుకు జై కొడుతున్నారు. మీరు తురుము.. తోపు అని అంటూ జై కొడుతున్నారు. మీరు పోరాడండి మేం వెనకుండి నడుస్తాం అని చంద్రబాబుకు ఎలివేషన్లు ఇస్తున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్‌లో కెరీర్ ప్రారంభించిన చంద్రబాబు ఆ తరువాత కాంగ్రెస్ పుట్టు విరోధి అయిన టీడీపీలో చేరారు. కాంగ్రెస్‌కు వ్యతిరేగంగా పోరాడి అధికారం చేపట్టారు. అయితే ఆ తరువాత మళ్ళీచాలా ఏళ్ళ తరువాత 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన చంద్రబాబు. ఆ ఎన్నికల్లో అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ ఘోరంగా దెబ్బతిన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ నీడ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోరాడుతున్నారు. ఇక అంధ్రలో కాంగ్రెస్ ఐతే ఉందో లేదో తెలియని పరిస్థితి.

ఈ తరుణంలో కేంద్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టి వేధిస్తోందని కేవీపీ బాధ పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రాహుల్‌కు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని కేవీపీ కోరుతున్నారు. ఆంతే కాకుండా ఈ క్రమంలోనే చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.

ఎన్డీఏ కన్వీనర్‌గా పని చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. దేశ రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందుండి. మీ వెనుక మేం ఉంటాం. మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు. ఎంతోరాజకీయ చతురత ఉంది. మీరు ముందు నడవండి మీ వెంట మేము ఉంటాం అంటూ లేనిపోని పెద్దరికాన్ని అప్పగించారు. అంతే కాకుండా నిన్న మొన్న అయన చంద్రబాబును కూడా కలిశారని అంటున్నారు.

అయితే కేవీపీ ఆయన ప్రశసంతో చంద్రబాబుకు తలనొప్పులు ఖాయమంటున్నారు. 2019లో బీజేపీ నుంచి విడిపోయి ఎన్నికలకు వెళ్లి దెబ్బ తిన్న చంద్రబాబు మళ్ళీ బీజేపీతో పోరాటానికి సిద్ధం అవుతారా.. కేవీపీ చెప్పారు కదా అని కాంగ్రెస్ కాడి మోయడానికి ధైర్యం చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. కేవీపీ అత్యుత్సాహంతో చేసిన కామెంట్లు చంద్రబాబుకు లేనిపోని తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి అంటున్నారు.