లేడీ బాషా!!.. అగ్గిపుల్ల ఎలా వెలిగించిందో చూడండి (వీడియో వైరల్)
విధాత: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి మనిషికి మొబైలే ఓ ప్రపంచంగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. మనం బస్సులు, రైళ్లు, కార్లు, బైకులపై ప్రయాణం చేసే సమయంలోనూ మొబైల్ మాట్లాడే వారిని, చాటింగ్ చేసే వారిని చూస్తుంటాం. ఒక్క నిమిషం దొరికినా ఆ సమయాన్ని కూడా మొబైల్ వినియోగానికే ప్రాదాన్యం ఇస్తుంటారు. ఇక్కడ ఈ వీడియో చూస్తే అదే కనిపిస్తుంది. చిన్న హోటల్‌లా కనిపిస్తున్న అక్కడ ఓ మహిళ […]

విధాత: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి మనిషికి మొబైలే ఓ ప్రపంచంగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. మనం బస్సులు, రైళ్లు, కార్లు, బైకులపై ప్రయాణం చేసే సమయంలోనూ మొబైల్ మాట్లాడే వారిని, చాటింగ్ చేసే వారిని చూస్తుంటాం. ఒక్క నిమిషం దొరికినా ఆ సమయాన్ని కూడా మొబైల్ వినియోగానికే ప్రాదాన్యం ఇస్తుంటారు.
ఇక్కడ ఈ వీడియో చూస్తే అదే కనిపిస్తుంది. చిన్న హోటల్‌లా కనిపిస్తున్న అక్కడ ఓ మహిళ ఫోన్ సంభాషణలో బిజిగా ఉన్నది. ఇక్కడ మొబైల్‌లో మాట్లాడటం ఎంత ముఖ్యమో.. సిగరేట్ తాగడం కూడా అంతకంటే ముఖ్యం అన్నట్టు ఉన్నది.
అందుకే మొబైల్ పక్కనపెట్టి సిగరేట్ వెలిగించేంత టైం లేదనుకున్నదో ఏమో అగ్గిపెట్టెను తన బూటు కాలుకింద పెట్టి వెలిగించింది. ఫోన్ మాట్లాడుతూ.. దర్జాగా సిగరేట్‌ను ఆస్వాదిస్తున్న ఆ మహిళ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.