విధాత: తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష పత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎల్బీనగర్‌లోని పరీక్ష కేంద్రాన్ని రాచకొండ పోలీస్ కమిషన్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పటిష్టభద్రత భద్రత ఏర్పాట్లు చేసిన ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
@TelanganaDGP @TelanganaCOPs @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @abnandhrajyothy @ManaTelanganaIN @NavatelanganaD @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @timesofindia @HydTimes @TheDailyMilap @TheSiasatDaily @way2_news pic.twitter.com/n4Co1uJ32W
— Rachakonda Police (@RachakondaCop) April 6, 2023
అయితే పరీక్ష కేంద్రంలోని వెళ్లే సమయంలో మొబైల్ తీసుకుని వెళ్తున్న కమిషనర్ చౌహాన్‌కు.. పరీక్షా కేంద్రంలోకి మొబైల్స్ అనుమతి లేదంటూ కల్పన అనే మహిళా కానిస్టేబుల్ ఆయనను అడ్డుకున్నారు.
వెంటనే ఆయన తన మొబైల్‌ను ఆమెకు అప్పగించారు. కల్పన చేసిన పనికి సీపీ అభినందించి రివార్డు ప్రకటించారు. ఏ అధికారి వచ్చినా ఇలాంటి పటిష్ట బందోబస్తు నిర్వహించానలి సీసీ సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.