యాద‌గిరిగుట్ట‌: హంస వాహనంపై విహరించిన భక్త వల్లభుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాలుగో రోజు ఉదయం వటపత్ర శాయిగా దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు సాయంత్రం వీణా ధారియై హంస వాహనంపై ఊరేగారు. హంస జ్ఞానానికి ప్రతీక… పరమాత్మ స్వరూపం. పాలు నీళ్లను వేరు చేసే హంస వలె పరమాత్మ భక్తులలోని అహాన్ని తొలగించి సద్గుణ సంపత్తిని అభివృద్ధి చెందిస్తారని హంస వాహన సేవ పరమార్ధం. భక్తులు హంసవలె నిర్మలమై ఉంటే వాళ్ల హృదయాలలో నేను వసించి ఉంటానంటూ స్వామి […]

యాద‌గిరిగుట్ట‌: హంస వాహనంపై విహరించిన భక్త వల్లభుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాలుగో రోజు ఉదయం వటపత్ర శాయిగా దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు సాయంత్రం వీణా ధారియై హంస వాహనంపై ఊరేగారు.

హంస జ్ఞానానికి ప్రతీక… పరమాత్మ స్వరూపం. పాలు నీళ్లను వేరు చేసే హంస వలె పరమాత్మ భక్తులలోని అహాన్ని తొలగించి సద్గుణ సంపత్తిని అభివృద్ధి చెందిస్తారని హంస వాహన సేవ పరమార్ధం. భక్తులు హంసవలె నిర్మలమై ఉంటే వాళ్ల హృదయాలలో నేను వసించి ఉంటానంటూ స్వామి వారు హంస వాహన దర్శన భాగ్యం కల్గించగా తీర్థజనులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.

సాయంత్రం కొండపైన కొనసాగుతున్న ధార్మిక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, అన్నమాచార్య ప్రాజెక్టు టిటిడి బృందం వారిచే అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించారు.