విధాత: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. ఇది శాసనం అంటూ పవన్ కళ్యాణ్ గతంలో అత్యంత ఆత్మ విశ్వాసంతో చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది. అదే కోవలో నేడు ఆయన మరో ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ఎలా ముఖ్యమంత్రి అవుతారో.. ఆయన ఎలా గెలుస్తారో చూస్తానని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాను అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మరోసారి గెలిచే ప్రసక్తే లేదు ఇది తథ్యం.. ఇదే సత్యం.. ఇదే ఖాయమని నొక్కి మరీ చెప్తున్నారు.
వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొట్టి తీరుతాం – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/yKqm7guMGG
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022
మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన ఆదివారం మాట్లాడుతూ వైసీపీ మీద ఇలా రుసరుసలాడారు. వైసీపీతో నేనే యుద్ధం చేస్తాను అని చెప్తూనే.. తను ఒక్కడు చాలు ఎవరి సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మధ్య విజయనగరంలో పర్యటించిన పవన్ అక్కడ మాట్లాడుతూ ఢిల్లీకి తన మీద చాడీలు చెబుతున్నారు అంటూ వైసీపీ మీద మండిపడ్డారు.
సమస్యలు పరిష్కారించాల్సిన ప్రభుత్వమే… సమస్యలను సృష్టిస్తోంది pic.twitter.com/J0QkK2jhsb
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022
ఇపుడు మరోసారి పవన్ అవే స్టేట్మెంట్లు ఇస్తూ వైస్సార్సీపీని కవ్విస్తున్నారు. తాను మీలాగా ఢిల్లీకి వెళ్లీ చాడీలు చెప్పే రకం కాదన్నారు. నేను ప్రధానిని ఎప్పుడు కలిసినా దేశ భవిష్యత్తు, ప్రజల రక్షణ గురించే మాట్లాడుతానని తెలిపారు. అలాగే వైసీపీని దెబ్బకొట్టాలీ అంటే అది ప్రధాని మోడీకి చెప్పి చేయనని కూడా ఆయన చెప్పడం విశేషం.
ఇప్పటం ప్రజల గడపలు కూల్చారు..
వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపోదు pic.twitter.com/4aD0PeckOZ— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022
ఏదీ చేయాలనుకున్నా ఒక్కడినే చేస్తాను అని సవాల్ చేశారు. ఇక్కడ పుట్టిన వాడిని ఇక్కడే తేల్చుకుంటాను అని గర్జించారు. నా యుద్ధం నేనే చేస్తాను అని బీజేపీ విషయంలో పవన్ ఈ విధంగా మాట్లాడారా లేక వైసీపీకి హెచ్చరికలు చేయడానికి అన్నారా అన్నది అయితే తెలియడం లేదు.
ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Live Link: https://t.co/76aHtRDElI
— JanaSena Party (@JanaSenaParty) November 27, 2022