త‌గ్గ‌నున్న చ‌లి.. నేడు, రేపు చిరు జ‌ల్లులు

త‌గ్గ‌నున్న చ‌లి- స్వ‌ల్పంగా పెరుగ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు ద‌క్షిణ అండ‌మాన్ తీరంలో ఈనెల 4 న తుఫాన్ ఆవ‌ర్త‌నం నేడు, రేపు అక్క‌డ‌క్క‌డ చిరు జ‌ల్లులు కురిసే అవ‌కాశం విధాత‌: ద‌క్షిణ అండ‌మాన్ తీరంలో ఈ నెల 4వ తేదీన తుఫాన్ ఆవ‌ర్త‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దీని ప్ర‌భావంతో ఇవ్వాళ‌, రేపు అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ ఆవ‌ర్త‌నం 5వ తేదీన అల్ప‌పీడ‌నంగా మారుతుంద‌ని గోపాల‌పూర్ వాతావ‌ర‌ణ […]

  • By: krs    latest    Dec 02, 2022 8:12 AM IST
త‌గ్గ‌నున్న చ‌లి.. నేడు, రేపు చిరు జ‌ల్లులు
  • త‌గ్గ‌నున్న చ‌లి- స్వ‌ల్పంగా పెరుగ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు
  • ద‌క్షిణ అండ‌మాన్ తీరంలో ఈనెల 4 న తుఫాన్ ఆవ‌ర్త‌నం
  • నేడు, రేపు అక్క‌డ‌క్క‌డ చిరు జ‌ల్లులు కురిసే అవ‌కాశం

విధాత‌: ద‌క్షిణ అండ‌మాన్ తీరంలో ఈ నెల 4వ తేదీన తుఫాన్ ఆవ‌ర్త‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దీని ప్ర‌భావంతో ఇవ్వాళ‌, రేపు అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ ఆవ‌ర్త‌నం 5వ తేదీన అల్ప‌పీడ‌నంగా మారుతుంద‌ని గోపాల‌పూర్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారి దాస్ తెలిపారు.

ఈ అల్పపీడనం బ‌ల‌ప‌డి వాయుగుండంగా మారి ఈ నెల 8వ తేదీన త‌మిళ‌నాడు పుదుచ్చేరిల మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు.