ప్రైవేటు కంపెనీలోకి ప్ర‌వేశించిన మృగ‌రాజు.. వీడియో వైర‌ల్

విధాత‌: గుజ‌రాత్‌లో సింహాలు విచ్చ‌ల‌విడిగా సంచ‌రిస్తున్నాయి. రాజులా ఏరియాలోని ఓ ప్రైవేటు కంపెనీలోకి ఓ సింహాం శుక్ర‌వారం ప్ర‌వేశించింది. ఆ సింహాన్ని చూసిన వ‌ర్క‌ర్లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై ప‌రుగులు పెట్టారు. కంపెనీలో సంచ‌రించిన సింహాం దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు.. ఆ కంపెనీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కంపెనీ ప‌రిస‌ర ప్రాంతాల్లో సింహాం ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలోకి 8 సింహాలు ప్ర‌వేశించి, […]

ప్రైవేటు కంపెనీలోకి ప్ర‌వేశించిన మృగ‌రాజు.. వీడియో వైర‌ల్

విధాత‌: గుజ‌రాత్‌లో సింహాలు విచ్చ‌ల‌విడిగా సంచ‌రిస్తున్నాయి. రాజులా ఏరియాలోని ఓ ప్రైవేటు కంపెనీలోకి ఓ సింహాం శుక్ర‌వారం ప్ర‌వేశించింది. ఆ సింహాన్ని చూసిన వ‌ర్క‌ర్లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై ప‌రుగులు పెట్టారు. కంపెనీలో సంచ‌రించిన సింహాం దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు.. ఆ కంపెనీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కంపెనీ ప‌రిస‌ర ప్రాంతాల్లో సింహాం ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.

అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలోకి 8 సింహాలు ప్ర‌వేశించి, వీధుల్లో ద‌ర్జాగా సంచ‌రించిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే అమ్రేలి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీలోకి సింహాం ప్ర‌వేశించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.