లిక్కర్‌ కేస్‌: ఈడీ అదుపులోకి బోయినపల్లి, విజయ్‌ నాయర్‌

విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నది. కొత్త ఉత్తర్వుల సమయంలో ఈడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నది. బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్నది. ఇదే కేసులో శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు ఈడీ కస్టడీలో ఉన్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో అభిషేక్‌ను, విజయ్‌ నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కస్టడీకి […]

  • Publish Date - November 14, 2022 / 06:04 AM IST

విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నది. కొత్త ఉత్తర్వుల సమయంలో ఈడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నది. బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్నది.

ఇదే కేసులో శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు ఈడీ కస్టడీలో ఉన్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో అభిషేక్‌ను, విజయ్‌ నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు మధ్యాహ్నం ఇరువురి వాదనలు విననున్నది.

ఇదిలాఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారాడు. ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేకోర్టు రికార్డు చేస్తున్నది.