లిక్కర్ మాఫియా.. చిలుకను విచారించిన పోలీసులు!
LIQUER విధాత: బిహార్‌లో ఈ మధ్య కల్తీ సారా చావులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం కూడా కల్తీ సారాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సారా నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గయా జిల్లాలో ఓ గ్రామంలో కల్తీసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో సారా తయారీ దారుని ఇంటిపై దాడి చేశారు. కానీ అప్పటికే పసిగట్టిన అక్రమ సారా తయారీదారుడు అమృత్ మల్లా పరారయ్యాడు. స్థానిక పోలీస్ […]

LIQUER
విధాత: బిహార్‌లో ఈ మధ్య కల్తీ సారా చావులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం కూడా కల్తీ సారాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సారా నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గయా జిల్లాలో ఓ గ్రామంలో కల్తీసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో సారా తయారీ దారుని ఇంటిపై దాడి చేశారు. కానీ అప్పటికే పసిగట్టిన అక్రమ సారా తయారీదారుడు అమృత్ మల్లా పరారయ్యాడు.
స్థానిక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కన్హయకుమార్ ఇంటిని అణువణువూ గాలించాడు. ఎవరూ కనిపించలేదు. పారిపోయిన మల్లా కోసం సమాచారం రాబట్టటం ఎలా అని ఆలోచించసాగాడు. కానీ.. ఇంట్లో ఓ మూలకు పంజరంలో చిలుక కనిపించింది. పోలీస్ అధికారికి ఐడియా వచ్చింది..! చిలుక నుంచే సమాచారం రాబడితే పోలా.. అనుకున్నాడు.
పోలీస్ అధికారి కన్హయకుమార్ చిలుకను విచారించటం మొదలు పెట్టాడు. మీ యజమాని ఎక్కడికెళ్లాడు.. అంటూ హిందీ, స్థానిక మగాహి భాషలో అడిగాడు. కానీ చిలుక అన్నింటికీ.. కటోరే.. కటోరే అంటూ సమాధానం ఇచ్చింది.
కటోరే అంటే చిప్ప. ఎంతైనా పెంచి పోషించిన విశ్వాసంతోనో ఏమో.. పోలీసులు ఎంత అడిగినా తన యజమాని ఎక్కడికెళ్లాడో చెప్పకుండా.. చిప్పలో సారా తయారు చేస్తున్నారని చెప్పి.. తప్పించుకున్నదని స్థానికులు అంటున్నారు.