కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. మంత్రుల శాఖలు ఇవే..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు

హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క), తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. వీరికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మంత్రులకు శాఖల కేటాయింపులు ఇలా..
భట్టి విక్రమార్క – రెవెన్యూ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం శాఖ
దామోదర రాజనర్సింహ – మెడికల్ అండ్ హెల్త్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్
దుద్దిళ్ల శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటి పారుదల
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమం
కొండా సురేఖ – మహిళా, శిశు సంక్షేమం
ధనసరి అనసూయ(సీతక్క) – గిరిజన సంక్షేమం
తుమ్మల నాగేశ్వర్ రావు – రోడ్లు, భవనాలు
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరా.