యాత్రా సీజన్ షురూ: లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర!

విధాత‌: ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తుండగా ఇటు జగన్ సైతం రివ్యూలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు, ప్రోగ్రెస్ రిపోర్టులు, నివేదికలతో అభ్యర్థుల గెలుపోటములను మదింపు చేస్తున్నారు. ఇవి ఇలా ఉండగానే అటు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు వేర్వేరుగా యాత్రలకు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ యువ నేత నారా లోకేష్.. పాదయాత్ర కు రెడీ అవుతున్నారు. జనవరి 27న ఆయన పాదయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రంలో పలు నియోజకావర్గాలను కలుపుతూ […]

యాత్రా సీజన్ షురూ: లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర!

విధాత‌: ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తుండగా ఇటు జగన్ సైతం రివ్యూలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు, ప్రోగ్రెస్ రిపోర్టులు, నివేదికలతో అభ్యర్థుల గెలుపోటములను మదింపు చేస్తున్నారు. ఇవి ఇలా ఉండగానే అటు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు వేర్వేరుగా యాత్రలకు సిద్ధం అవుతున్నాయి.

టీడీపీ యువ నేత నారా లోకేష్.. పాదయాత్ర కు రెడీ అవుతున్నారు. జనవరి 27న ఆయన పాదయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రంలో పలు నియోజకావర్గాలను కలుపుతూ ఆయన చేసే యాత్ర ఖచ్చితంగా తమకు ఉపకరిస్తుందని టీడీపీ ఆశిస్తోంది.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి తర్వాత బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. జిల్లాల వారీగా బలం ఉన్న చోట గెలుస్తామని అనుకున్న చోట ఈ యాత్రలు చేయనున్నారు. ఇప్పటికే వారాహి అనే బస్సును సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ ఇక యాత్రలు చేయ‌డ‌మే త‌రువాయి.

పార్టీల యాత్ర‌ల‌తో వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేడెక్కడం తప్పదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ సారథి జగన్ కూడా తన ఏర్పాట్లలో ఉన్నారు. దాదాపు ఐదు లక్షల మంది గ్రామ సారథులను సిద్ధం చేసిన జగన్ తన బలాన్ని, బలగాన్ని చూపించారు.

త్వరలోనే వీరిని కూడా ప్రజలకు పరిచయం చేయ‌నున్నారు. గ్రామాల్లో వారి ఉనికి ఉండేలా చూస్తారు. ఆ తరువాత జగన్ కూడా జనంలోకి వెళతారని అంటున్నారు. జగన్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెడితే మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణం మారుతుందని అంటున్నారు.