టీచర్‌తో విద్యార్థి ప్రేమాయణం.. మనస్తాపంతో ఆత్మహత్య
విధాత: విద్యార్థి ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయురాలిని చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఈ మధ్యే ప్లస్ టూ పూర్తి చేశాడు. ఆగస్టు 30వ తారీఖున మిత్రులతో కలిసి చెన్నై రాజధాని కాలేజీలో కౌన్సెలింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చాడు. తర్వాత గదిలోకి వెళ్లిన ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మార్గ మధ్యంలోనే ఆ విద్యార్థి ప్రాణాలు […]

విధాత: విద్యార్థి ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయురాలిని చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఈ మధ్యే ప్లస్ టూ పూర్తి చేశాడు. ఆగస్టు 30వ తారీఖున మిత్రులతో కలిసి చెన్నై రాజధాని కాలేజీలో కౌన్సెలింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చాడు. తర్వాత గదిలోకి వెళ్లిన ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మార్గ మధ్యంలోనే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సూసైడ్ గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ప్రేమ వ్యవహారంలో విఫలం కావడంతోనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేల్చారు. ఆ ప్రేమ వ్యవహారం తన టీచర్ తోనే నడిపించాడని పోలీసులు గుర్తించారు. అంబత్తూరులోని సర్ రామస్వామి ముదలియార్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో బాలుడు చదువుతున్న సమయంలోనే ఓ మహిళ అందులో పని చేసేది. ఆమె పాఠశాలలో చేస్తూనే ప్రైవేటుగా ట్యూషన్లు కూడా చెబుతుండేది. ఆ ట్యూషన్లకు వెళ్లే వాడు ఆ బాలుడు.
అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ప్రేమిస్తున్నట్లు ఆ ఉపాధ్యాయురాలు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ టీచర్‌కు ఈమధ్యే పెళ్లి నిశ్చయం కావడంతో.. బాలుడితో మాట్లాడటం మానేసింది. తనను పూర్తిగా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు సూసైడ్ కేసులో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.