పాతగుట్టలో మహా పూర్ణాహుతి.. చక్రతీర్థం

విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధాలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలకు మహా పూర్ణాహుతి హోమ‌ హావిసులు అందించారు. భక్తులు సుదర్శన చక్రతీర్థం సందర్భంగా పుష్కరిణిలో స్నానమాచ‌రించి తరించారు. సాయంత్రం దేవతోద్వాసన, శ్రీ పుష్పయాగం, డోలారోహణం ఘట్టాలను నిర్వహించనున్నారు. రేపు సోమవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం, సాయంత్రం మహా ఆశీర్వాచనం పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాల […]

  • Publish Date - February 5, 2023 / 09:12 AM IST

విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధాలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలకు మహా పూర్ణాహుతి హోమ‌ హావిసులు అందించారు. భక్తులు సుదర్శన చక్రతీర్థం సందర్భంగా పుష్కరిణిలో స్నానమాచ‌రించి తరించారు. సాయంత్రం దేవతోద్వాసన, శ్రీ పుష్పయాగం, డోలారోహణం ఘట్టాలను నిర్వహించనున్నారు.

రేపు సోమవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం, సాయంత్రం మహా ఆశీర్వాచనం పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాల ఘట్టాలు ముగియనున్నాయి.