Maintenance | భార్యే ఎక్కువ సంపాదిస్తోంది.. మెయింటెనెన్స్‌ అవ‌స‌రం లేదు: కోర్టు

విధాత: భ‌ర్త క‌న్నా భార్యే సంవ‌త్స‌రానికి రూ.4 ల‌క్ష‌లు ఎక్కువ సంపాదిస్తున్నందున ఆవిడ‌కు మెయింటెనెన్స్(Maintenance) చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ముంబ‌యిలోని సెష‌న్సు కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌మ‌ర్థించింది. ఉద్యోగం చేసే మ‌హిళ అయినా మెయింటెనెన్స్ పొంద‌డానికి అర్హురాలే. అయితే ప‌రిస్థితులు కూడా దానిని బ‌ల‌ప‌రిచే విధంగా ఉండాలి. ప్ర‌స్తుత సాక్ష్యాధారాల‌ను బ‌ట్టి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నామని సెష‌న్స్ కోర్టు జ‌డ్జి వ్యాఖ్యానించారు. గృహ‌కింస కింద స‌ద‌రు మహిళ […]

  • Publish Date - May 28, 2023 / 05:54 AM IST

విధాత: భ‌ర్త క‌న్నా భార్యే సంవ‌త్స‌రానికి రూ.4 ల‌క్ష‌లు ఎక్కువ సంపాదిస్తున్నందున ఆవిడ‌కు మెయింటెనెన్స్(Maintenance) చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ముంబ‌యిలోని సెష‌న్సు కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌మ‌ర్థించింది.

ఉద్యోగం చేసే మ‌హిళ అయినా మెయింటెనెన్స్ పొంద‌డానికి అర్హురాలే. అయితే ప‌రిస్థితులు కూడా దానిని బ‌ల‌ప‌రిచే విధంగా ఉండాలి. ప్ర‌స్తుత సాక్ష్యాధారాల‌ను బ‌ట్టి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నామని సెష‌న్స్ కోర్టు జ‌డ్జి వ్యాఖ్యానించారు.

గృహ‌కింస కింద స‌ద‌రు మహిళ కోర్టును ఆశ్ర‌యించారు. తాను గ‌ర్భంతో ఉన్న‌పుడు భ‌ర్త‌, అత్త‌మామాలు బ‌య‌ట‌కు గెంటేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. భ‌ర్త లైంగిక స‌మ‌స్య‌కు చికిత్స తీసుకుంటున్న విష‌యం త‌న ద‌గ్గ‌ర దాచార‌ని, తాను గ‌ర్భం దాల్చ‌డంతో వారంతా త‌న‌ను అనుమానించ‌డం మొద‌లుపెట్టార‌ని పేర్కొన్నారు.

త‌న‌కు త‌న సంతానానికి మెయింట‌నెన్స్ ఇవ్వాల‌ని ఆమె కోర్టును కోర‌గా.. ఆ బిడ్డ‌కు తాను తండ్రిని కాద‌ని భ‌ర్త కోర్టుకు తెలిపారు. తుది తీర్పు ఇచ్చే వ‌ర‌కు నెల‌కు రూ.10 వేలు బిడ్డ‌కు పంపించాల‌ని మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్త‌ర్వును సైతం పాటించాల‌ని సెష‌న్సు కోర్టు భ‌ర్త‌కు సూచించింది.