Panama Canal | ప‌నామా కెనాల్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్‌.. ఇరువైపులా నిలిచిన 200కు పైగా నౌక‌లు

ఇరువైపులా నిలిచిన 200కుపైగా నౌక‌లు కరువుతో వ‌ర్షాలు లేక‌పోవ‌డ‌మే కార‌ణం Panama Canal | విధాత‌: ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ నిలిచిపోతే అడ్డంకుల‌ను తొల‌గించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తాం. లేదా వేరేమార్గం గుండా వాహ‌నాల‌ను దారి మ‌ళ్లిస్తాం. కానీ, రెండు స‌ముద్రాలను క‌లిపే ప‌నామా కాలువ వ‌ద్ద నౌక‌ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. కాలువ ఇరువైపులా 200ల‌కు పైగా నౌక‌లు నిలిచిపోయాయి. కొన్ని నౌక‌లు మూడు వారాలకు పైగా అక్క‌డే చిక్కుకుపోయాయి. పసిఫిక్ -అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే పనామా […]

  • By: Somu    latest    Aug 23, 2023 10:32 AM IST
Panama Canal | ప‌నామా కెనాల్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్‌.. ఇరువైపులా నిలిచిన 200కు పైగా నౌక‌లు
  • ఇరువైపులా నిలిచిన 200కుపైగా నౌక‌లు
  • కరువుతో వ‌ర్షాలు లేక‌పోవ‌డ‌మే కార‌ణం

Panama Canal |

విధాత‌: ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ నిలిచిపోతే అడ్డంకుల‌ను తొల‌గించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తాం. లేదా వేరేమార్గం గుండా వాహ‌నాల‌ను దారి మ‌ళ్లిస్తాం. కానీ, రెండు స‌ముద్రాలను క‌లిపే ప‌నామా కాలువ వ‌ద్ద నౌక‌ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. కాలువ ఇరువైపులా 200ల‌కు పైగా నౌక‌లు నిలిచిపోయాయి. కొన్ని నౌక‌లు మూడు వారాలకు పైగా అక్క‌డే చిక్కుకుపోయాయి.

పసిఫిక్ -అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే పనామా కెనాల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకా ర‌వాణా మార్గాల్లో ఒక‌టి. అమెరికాకు వెళ్లే మొత్తం నౌకల కంటెయిన‌ర్ల‌లో ఇక్క‌డి నుంచే 40 శాతం వ‌ర‌కు వెళ్తాయి.

కానీ, వాతావరణ మార్పుల ప్రభావంతో వాన‌లు కుర‌వ‌క‌ నీటి మట్టాలు తగ్గి నౌక‌ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతున్న‌ది. త‌ద్వారా కాలువ ఇరువైపులా ట్రాఫిక్ జామ్ క‌లుగుతున్న‌ది. నౌక‌లు నిలిచిపోయిన నేప‌థ్యంలో పనామా కెనాల్ అథారిటీ క‌ఠిన నిబంధ‌న‌లు పెట్టింది. అత్యంత బరువైన, అతిపెద్ద నౌకలపై అధిక ప‌న్ను విధించింది.

“ప్రస్తుతం పనామాలో తీవ్ర కరువు కారణంగా ఓడలు చిక్కుకుపోయాయి. కాలువలో నీటి వనరులను తిరిగి నింపడానికి వర్షపు నీరే ఆధారం. అయితే వర్షం లేకపోవడం వల్ల పడవలు దాటడం కష్టమవుతున్న‌ది” అని ఓ ప్రైవేటు ఇన్వేస్టిగేష‌న్ ఏజెన్సీ తెలిపింది. ఈ మేర‌కు నౌక‌ల‌ ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టుచేసింది.