పిల్లలు పూలు తెంపారని తల్లి ముక్కుకోశాడు!
ఓ మహిళపై ఒకడు అతి దారుణంగా ప్రవర్తించాడు. మానవత్వం మరిచి అమానుష చర్యలకు పాల్పడ్డాడు

- కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన
- బాధితురాలి పరిస్థితి విషమం.. పరారీలో నిందితుడు
విధాత: ఓ మహిళపై ఒకడు అతి దారుణంగా ప్రవర్తించాడు. మానవత్వం మరిచి అమానుష చర్యలకు పాల్పడ్డాడు. ఆమె పిల్లలు తన తోటలో నుంచి పువ్వులు తెంపారనే కోపంతో అతడు ఆ పిల్లల తల్లి ముక్కు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగావి జిల్లాలోని బసుర్తే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సుగంధ మోరే (50)కు చిన్న పిల్లలు ఉన్నారు. వారు కళ్యాణి మోరేకు చెందిన ఒక పూల తోటలో కొన్ని పూలు కోశారు. మీ పిల్లలు తన తోటలో పూలు తెంచారని సుగంధ మోరే (50)తో కళ్యాణి మోరే గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర కోపంతో ఊగిపోతూ ఆమె ముక్కును కత్తితో కోసేశాడు.
తీవ్ర రక్తస్రావమైన బాధితురాలిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.