గ‌ర్భా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్ప‌కూలాడు.. వీడియో

విధాత: దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా గుజ‌రాత్‌లోని ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో శివ‌శ‌క్తి సొసైటీ ఆధ్వ‌ర్యంలో గ‌ర్భా డ్యాన్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పాలుపంచుకున్నారు. అంద‌రూ ఉల్లాసంగా గ‌ర్భా డ్యాన్స్ చేస్తున్నారు. ఓ 21 ఏండ్ల యువ‌కుడు గ‌ర్భా డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలిపోయాడు. అప్ర‌మ‌త్త‌మైన నిర్వాహ‌కులు.. అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ యువ‌కుడు గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మృతుడిని వీరేంద్ర […]

గ‌ర్భా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్ప‌కూలాడు.. వీడియో

విధాత: దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా గుజ‌రాత్‌లోని ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో శివ‌శ‌క్తి సొసైటీ ఆధ్వ‌ర్యంలో గ‌ర్భా డ్యాన్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పాలుపంచుకున్నారు. అంద‌రూ ఉల్లాసంగా గ‌ర్భా డ్యాన్స్ చేస్తున్నారు. ఓ 21 ఏండ్ల యువ‌కుడు గ‌ర్భా డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలిపోయాడు.

అప్ర‌మ‌త్త‌మైన నిర్వాహ‌కులు.. అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ యువ‌కుడు గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మృతుడిని వీరేంద్ర సింగ్ ర‌మేశ్ బాయి రాజ్‌పుత్‌గా గుర్తించారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.