Dalitha Bandhu | దళిత బంధు రాలేదు.. ప్రాణం పోయింది

Dalitha Bandhu విధాత: దళిత బంధు పథకం తనకు వస్తుందని…స్వయం ఉపాధితో జీవితంలో పైకి ఎదగవచ్చన్న దళిత దినసరి కూలీ ఆశలు తలకిందులై దళిత బంధు దక్కకపోవడంతో నిరాశతో బలవన్మరణనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన కూరెల్ల రమేశ్(46) తనకు దళిత బంధు రాలేదన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో దళితబంధు రానందుకు తాను […]

  • By: Somu    latest    Aug 09, 2023 11:52 AM IST
Dalitha Bandhu | దళిత బంధు రాలేదు.. ప్రాణం పోయింది

Dalitha Bandhu

విధాత: దళిత బంధు పథకం తనకు వస్తుందని…స్వయం ఉపాధితో జీవితంలో పైకి ఎదగవచ్చన్న దళిత దినసరి కూలీ ఆశలు తలకిందులై దళిత బంధు దక్కకపోవడంతో నిరాశతో బలవన్మరణనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన కూరెల్ల రమేశ్(46) తనకు దళిత బంధు రాలేదన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో దళితబంధు రానందుకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇందుకు కూరెళ్ల స్వామి కారణమంటు రాసివుంది. మృతుడు రమేశ్ ఉంటున్న మోత్కూర్ ఇందిరా నగర్ కాలనీలో మొదటి విడత దళిత బంధు పథకం కింద పలువురికి డబ్బులు అందాయి.

రెండో జాబితా లబ్ధిదారుల్లో తన పేరు చేర్చి దళిత బంధు పథకం వచ్చేలా చేయాలంటు అతను కాలనీ కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామితో పాటు స్థానిక నాయకుల వద్దకు కొంతకాలంగా తిరుగుతున్నాడు. తాను ఎంత ప్రయత్నించిన దళిత బంధు రాలేదన్న నిరాశతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రమేశ్ సూసైడ్ నోట్‌లో తన పేరు ఉండటంపై కౌన్సిలర్ కూరెళ్ల స్వామి స్పందిస్తు, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే చేస్తారని, ఇందులో తనకు సంబంధం లేదని, తాను అడ్డుకున్నానన్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.

మృతుడి కుటుంబానికి పీసీసీ నేత చామల పరామర్శ

దళిత బంధు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న కూరెళ్ల రమేశ్ భౌతిక కాయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. దళితబంధు పథకంలో లోపాలకు, అర్హులకు అందడం లేదన్న ఆరోపణలకు రమేశ్ ఆత్మహత్య ఉదంతం నిదర్శనమన్నారు. రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.