Nizamabad | సహజ వనరులను దోచుకున్న ఘనుడు వేముల: మానాల మోహన్ రెడ్డి

Nizamabad | విధాత ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సహజ వనరులను దోచుకున్న దొంగ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని, మోరం, ఇసుకను జిల్లాలో విచ్చల విడిగా దోచుకున్న ఘనుడు వేముల ప్రశాంత్ రెడ్డి అని […]

  • Publish Date - June 27, 2023 / 12:31 AM IST

Nizamabad |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సహజ వనరులను దోచుకున్న దొంగ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని, మోరం, ఇసుకను జిల్లాలో విచ్చల విడిగా దోచుకున్న ఘనుడు వేముల ప్రశాంత్ రెడ్డి అని జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు.

వేముల ప్రశాంత్ రెడ్డి బినామి క్రషర్ లో దోచుకున్నదెంతో తెలుపాలని తాము అడిగితే ప్రశాంత్ రెడ్డి తన క్రషర్ తో పాటు పొలంను 10 కోట్లకు అమ్ముతానని ప్రతిపక్షలకు ఆఫర్ ఇచ్చారని కాని తాము దోచుకున్నది ఎంతో చెప్పాలని డిమాండ్ చేశామన్నారు. తాము డిమాండ్ చేసిన ఆరు అంశాలలో ఎక్కడా ఒక్క రూపాయి తీసుకోలేదని దీనిపై తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.