Manchiryala | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బ‌హిష్క‌రిస్తూ అల్లిపూర్ గ్రామ‌స్తుల తీర్మానం

Manchiryala చెరువులు కబ్జాలు చేస్తుంటే ఉత్సవాలు జరపాలా? ఉత్సవాల బహిష్కరణ పై గ్రామపంచాయతీలో తీర్మానం అక్రమ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ ప్రజలు గ్ర‌మాపంచాయ‌తీలో నిర్వ‌హించే ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు తీర్మానం చేసి.. అధికారుల‌కు తీర్మాన ప‌త్రాలు స‌మ‌ర్పించారు. చెరువుల‌ను క‌బ్జాలు చేస్తుంటే ఉత్స‌వాలు ఏలా చేసుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న గురువారం "ఊరూరా […]

Manchiryala | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బ‌హిష్క‌రిస్తూ అల్లిపూర్ గ్రామ‌స్తుల తీర్మానం

Manchiryala

  • చెరువులు కబ్జాలు చేస్తుంటే ఉత్సవాలు జరపాలా?
  • ఉత్సవాల బహిష్కరణ పై గ్రామపంచాయతీలో తీర్మానం
  • అక్రమ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ ప్రజలు గ్ర‌మాపంచాయ‌తీలో నిర్వ‌హించే ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు తీర్మానం చేసి.. అధికారుల‌కు తీర్మాన ప‌త్రాలు స‌మ‌ర్పించారు. చెరువుల‌ను క‌బ్జాలు చేస్తుంటే ఉత్స‌వాలు ఏలా చేసుకుంటామ‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న గురువారం “ఊరూరా చెరువుల పండుగ” నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులు సన్నాహ సమావేశాలు చేస్తున్న క్రమంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.

చెరువులలోని సారవంతమైన మట్టిని అక్రమంగా తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువులు కబ్జాలకు గురైన నేపథ్యంలో చెరువుల పండుగ ఎలా చేస్తామని గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగను బహిష్కరిస్తున్నామని తీర్మానం చేసి అధికారులకు ఇవ్వడం జరిగింది.