మా ఫ్యామిలీ విషయాలు కెమెరాలకు చూపించలేం: మంచు లక్ష్మీ

మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారేంటి? విధాత: సోషల్ మీడియాలో తరచు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటుంది మంచు కుటుంబం. ముఖ్యంగా మా ఎన్నికల తర్వాత ఈ కుటుంబం చేస్తున్న ఓవరాక్షన్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. నెగటివిటి బాగా పెరిగిపోయింది. మా కుటుంబంపై ఓ హీరో డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారని, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా నాకు తెలుసు.. త్వరలోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నా నంటూ మంచు విష్ణు అప్పట్లో […]

  • By: krs    latest    Dec 26, 2022 9:38 AM IST
మా ఫ్యామిలీ విషయాలు కెమెరాలకు చూపించలేం: మంచు లక్ష్మీ

మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారేంటి?

విధాత: సోషల్ మీడియాలో తరచు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటుంది మంచు కుటుంబం. ముఖ్యంగా మా ఎన్నికల తర్వాత ఈ కుటుంబం చేస్తున్న ఓవరాక్షన్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. నెగటివిటి బాగా పెరిగిపోయింది. మా కుటుంబంపై ఓ హీరో డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారని, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా నాకు తెలుసు.. త్వరలోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నా నంటూ మంచు విష్ణు అప్పట్లో చాలా పెద్ద కామెడీ షో చేశాడు. ఇక మంచు లక్ష్మి మాత్రం మరో విధంగా స్పందిస్తోంది.

ఆమె మాట్లాడుతూ నాపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, ట్రోల్స్ ని నేను పెద్దగా పట్టించుకోను. పనీ పాటా లేకుండా చేసే కామెంట్స్ చేసే వాళ్ళని పట్టించుకుంటే నా విలువైన సమయం వృధా అవుతుంది. ఈమధ్య ఒక న్యూస్ చూశాను. మంచు మనోజ్‌ని మా కుటుంబం దూరం పెట్టేసిందని ఆ వార్త సారాంశం.

నాకు, విష్ణుకి మధ్య మాటలు లేవని కూడా కామెంట్స్ వచ్చాయి. మనోజ్‌ని నేను తర‌చూ కలుస్తూ ఉంటాను. ఇక విష్ణుకి తన పిల్లలు, బిజినెస్ మాత్రమే ప్రపంచం. తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నా మా కుటుంబ సభ్యులందరం.. వారానికి ఒకసారి అయినా కలిసి చాలా ఎంజాయ్ చేస్తాం. వాటన్నిటినీ మేము కెమెరాలకు చూపించలేము కదా..!అని కామెంట్ చేసింది.

ఒకవైపు విష్ణు ఏమో ట్రోల్స్ చేసే వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటాడు.. మరోవైపు మంచు లక్ష్మి ఏమో ఇలాంటివి పట్టించుకుంటే సమయం వృధా అవుతుంది.. అంటోంది. అంతేకాదు, ట్రోలర్స్‌కి హింట్స్ కూడా ఇస్తుంటానని రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో ఆమె చెప్పుకొచ్చింది. మొత్తంగా చూస్తే.. వారి బాధ ఏమిటి? వారి ఉద్దేశ్యం ఏమిటి? అనేది ఆ దేవుడికే తెలియాలన్నట్లుంది వ్యవహారం.

లిప్‌లాక్‌లతో ‘మాన్‌స్టర్‌’లో లెస్బియన్‌గా కేక పెట్టించిన మంచులక్ష్మి..!