మంచు లచ్చక్క.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదేనేమో..
విధాత: పనిలేని వాడు ఏదో చేశాడంటారు మన పెద్దలు.. కొందరు నెటిజన్ల పని ఈ సామెతకు చాలా దగ్గరగా ఉంది. వారు ఇలాంటి పనులు చేస్తూ తమను తాము గ్రేట్ అనుకుంటుంటారు. ఇక విషయానికి వస్తే డిసెంబర్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ఒక ఫోటో ట్వీట్ చేశాడు. పవన్ ఈ పోస్ట్‌తో పాటు రెండు దశాబ్దాల తర్వాత మరలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోపై సోషల్ మీడియాలో […]

విధాత: పనిలేని వాడు ఏదో చేశాడంటారు మన పెద్దలు.. కొందరు నెటిజన్ల పని ఈ సామెతకు చాలా దగ్గరగా ఉంది. వారు ఇలాంటి పనులు చేస్తూ తమను తాము గ్రేట్ అనుకుంటుంటారు. ఇక విషయానికి వస్తే డిసెంబర్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ఒక ఫోటో ట్వీట్ చేశాడు.
పవన్ ఈ పోస్ట్‌తో పాటు రెండు దశాబ్దాల తర్వాత మరలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. నెటిజన్లు మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన వాళ్లు ఈ ట్వీట్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
సంజు రెడ్డి అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు మంచు లక్ష్మి ఫోటోలు పెట్టి వీటి కింద ఓ సినిమాలోని ఫోటోతో మీమ్ పోస్ట్ చేశాడు. మీమ్‌లో సినిమాలే రీమేక్ అనుకున్నా… స్టిల్స్ కూడానా.. అని ఉంది. మొత్తానికి వైసీపీకి సపోర్ట్ చేస్తూ పవన్‌ని ట్రోల్ చేయడంలో ఈ నెటిజన్ మంచి క్రియేటివిటీనే చూపించాడు.
కానీ.. ఇలాంటివి ముఖ్యమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదో సినిమాలైతే పర్వాలేదు గానీ.. రాజకీయాల్లో కూడా ఇలాంటి పని లేని పనులు ఎందుకు? అంటూ కొందరు మండిపడుతున్నారు. వైసీపీ వాళ్లు సపోర్ట్ చేస్తుంటే జనసేన వాళ్లు కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ట్వీట్‌ను చూసి మంచు లక్ష్మి మౌనంగా ఉండుంటే సరిపోయుండేది.
కానీ తండ్రి, అన్నలు, ఇతర తమ్ములు, మెగా వ్యతిరేకుల కళ్లలో సంతోషం చూడటం కోసం ఆమె పని కట్టుకొని రీ ట్వీట్ చేయడంతో పాటు.. మంచో, చెడో నాకు తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ గారి పక్కన నా పిక్ చూస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ రీట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇది వైసీపీ వీరాభిమానులు చేసిన పని. దీనిని ఆమె ఖండించాల్సింది పోయి.. థ్రిల్లవుతున్నానంటూ ట్వీట్ చేయడంతో.. కావాలనే మంచు లక్ష్మీ అలా చేసిందంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. సమయం దొరికిందని హుందాతనం మరిచి ఇలా కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తే.. ఇట్టాగే ఉంటుంది. ఆమె ట్వీట్‌తో మరోసారి.. మొత్తానికి మంచు ఫ్యామిలీ రూటే వేరప్పా.. అనేలా కామెంట్స్ వైరల్ అవుతుండటం విశేషం!
Good or bad I’m thrilled my pic is next to @PawanKalyan garu