Manipur | మణిపూర్‌కు ‘ఇండియా’ ఎంపీలు
Manipur శని, ఆదివారాల్లో నేతల పర్యటన న్యూఢిల్లీ: మణిపూర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన పలువురు ఎంపీలు 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ ప్రతినిధి బృందంలో 20 మందికిపైగా ఎంపీలు ఉంటారని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. గత కొంతకాలంగా మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రతిపక్ష ఎంపీలు అనుమతి కోరుతున్నా.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేత మణిపూర్‌కు వెళ్లి, కొన్ని […]

Manipur
- శని, ఆదివారాల్లో నేతల పర్యటన
న్యూఢిల్లీ: మణిపూర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన పలువురు ఎంపీలు 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ ప్రతినిధి బృందంలో 20 మందికిపైగా ఎంపీలు ఉంటారని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. గత కొంతకాలంగా మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రతిపక్ష ఎంపీలు అనుమతి కోరుతున్నా.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరిస్తూ వచ్చారు.
అయినప్పటికీ కాంగ్రెస్ నేత మణిపూర్‌కు వెళ్లి, కొన్ని ప్రాంతాల్లో బాధితులను కలుసుకుని, వారి గోడు విన్నారు. తాజాగా మణిపూర్ వెళ్లనున్న ప్రతినిధి బృందంలో ‘ఇండియా’ కూటమికి చెందిన పలువురు ఎంపీలు ఉంటారు.
మణిపూర్ హింసపై ఇప్పటి వరకూ ప్రధాని నరేంద్రమోదీ నోరు మెదిపింది లేదు. ఇటీవల ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత తప్పక రెండు ముక్కలు మాట్లాడారు తప్పించి..ఈ అంశంపై పార్లమెంటులో స్పందించేందుకు వెనుకాడుతున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు.. ముందుగా ప్రధాని ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, అనంతరం చర్చిద్దామని చెబుతున్నాయి.
అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందు చర్చిద్దామని, దానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానం చెబుతారని అంటున్నది. ఈ విషయంలో మోదీని రక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా రోజూ వాయిదాలు పడుతున్నాయి.