Manipur | కుకీ మహిళలపై హింసాకాండలో.. మీరా పేబీస్ వివాదాస్పద పాత్ర- చేదు నిజాలు

Manipur విధాత ప్రతినిధి: మణిపూర్ లో హింసాకాండ మొదలై నాలుగు నెలలకు పైగా అవుతున్నది. ఈ హింస అక్కడి జాతుల మధ్య తలెత్తిన సంఘర్షణల వల్ల విస్తరించి విశాల రూపం తీసుకున్నది. తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. కోట్లాది ఆస్తులు ధ్వంసమయ్యాయి. సుమారు 60,000 మంది ప్రజలు శరణార్థులుగా ప్రభుత్వ తాత్కాలిక క్యాంపుల్లో ఉండే పరిస్థితి నెలకొన్నది. చనిపోయిన వారి వివరాలు, ఆస్తుల నష్టాలు స్పష్టంగా ఇంకా తేలవలసి ఉన్నది. మణిపూర్ లో ప్రధానంగా కుకీల జనాభా […]

  • Publish Date - August 6, 2023 / 01:59 AM IST

Manipur

విధాత ప్రతినిధి: మణిపూర్ లో హింసాకాండ మొదలై నాలుగు నెలలకు పైగా అవుతున్నది. ఈ హింస అక్కడి జాతుల మధ్య తలెత్తిన సంఘర్షణల వల్ల విస్తరించి విశాల రూపం తీసుకున్నది. తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. కోట్లాది ఆస్తులు ధ్వంసమయ్యాయి. సుమారు 60,000 మంది ప్రజలు శరణార్థులుగా ప్రభుత్వ తాత్కాలిక క్యాంపుల్లో ఉండే పరిస్థితి నెలకొన్నది. చనిపోయిన వారి వివరాలు, ఆస్తుల నష్టాలు స్పష్టంగా ఇంకా తేలవలసి ఉన్నది.

మణిపూర్ లో ప్రధానంగా కుకీల జనాభా అధికం. మైతేయీలు రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత నాగాలు ఇంకా ఇతరులు ఉన్నారు. అయితే ప్రస్తుత మణిపూర్ ఘర్షణలు మైతేయీలు ,కుకీల మధ్య చెలరేగిన హింస వల్ల తలెత్తింది. ఫలితంగా రెండు వైపులా తీవ్ర నష్టం ఉన్నా, అధికంగా కుకీలు కోల్పోయారు. కుకీలపై ఘోరమైన కృత్యాలు అమలు చేశారు. కుకీ మహిళలను దారుణంగా చంపివేశారు. మహిళలపై లెక్కలేనన్ని లైంగిక దాడులకు పాల్పడ్డారు. వారిని వివస్త్రలను చేసి రోడ్లపై తిప్పారు. ఇవన్నీ చేదు నిజాలు, కఠిన వాస్తవాలు.

అయితే వీటన్నిటిలోనూ విస్త్రృతంగా మైతేయీ సాయుధ మూకలు పాల్గొన్నాయనేది కాదనలేని సత్యం. అయితే ఈ సాయుధ మూకలలో మైతేయీ మహిళలు కూడా విస్త్రృతంగానే కలిసి ఉండి ఈ ఘటనలకు పాల్పడ్డారనేది అక్కడ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న వార్తలు. రజలోల్ప్మైతేయీ మహిళలు వారి మహిళా విభాగం మీరా పేబిస్ లో సంఘటితమైవున్నారు.

కుకీలపై జరిగిన దాడుల్లో మీరాపేబిస్ మహిళలే ముందుండి కుకీ మహిళలపై కసితో లైంగిక దాడులు మైతేయీ పురుషులతో చేయించారనే వార్తలు కూడా ప్రచారంలో వున్నాయి. అయితే దీనిపై మణిపూర్ కు దూరంగా ఉన్న ప్రజల్లో సందిగ్ధత నెలకొనివున్నది. మహిళలు ఇతర మహిళలపై ఇలా లైంగికదాడులు చేయిస్తారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల్లోఈ విషయాన్ని నమ్మేవారు, నమ్మనివారు అనే రెండు వర్గాలు కొనసాగుతున్నాయి.

ఈలోగా మీడియా రిపోర్టర్లు ,ప్రముఖ జర్నలిస్టులు కొన్నివాస్తవాలు బయటకు తీసుకవచ్చే ప్రయత్నాలు చేసినా, అవి సరిపోలేదు. అయితే ప్రజలు వాటిని పూర్తిగా నమ్మే పరిస్థితి అక్కడ లేదు. మణిపూర్ లో మీరా పేబిస్ పాత్ర ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా అనే స్పష్టత ప్రజల్లో ఏర్పడలేదు. జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై ,దోషులపై ప్రజల్లో స్పష్టత తీసుకరావడానికి గౌహాతికి చెందిన మరొక సీనియర్ మహిళా జర్నలిస్టు తోరా అగర్వాల తాజాగా చేసిన చొరవ అభినందనీయం.

ఆమె ప్రత్యక్షంగా అతి ప్రమాదకర హింసా గ్రస్త ప్రాంతాల్లో పర్యటించారు. ఘర్షణలకు దిగుతున్న మైతేయీ, కుకీ ల సముదాయాలతోనూ, మరీ ముఖ్యంగా ఆ రెండింటి సముదాయాల మహిళలతోనూ ఆమె ముఖాముఖీ చర్చించారు. వారి అభిప్రాయాలను, అసలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పలువురు ప్రముఖ మీడియా విశ్లేషకులు మణిపూర్ వాస్తవాలకు అతి దగ్గరగా ఆమె లేవనెత్తిన అంశాలున్నాయని ఆమెతో ఏకీభవించారు. ప్రస్తుతం ఆ అంశాల వివరాలను, మీరాపేబీస్ ఆచరణను పరిశీలిద్దాం.

మైతేయీ మహిళల మీరాపేబీస్ విశాల చరిత్ర కలిగిఉన్న సంస్థ. ఆ సంస్థ గత చరిత్రంతా పోరాటాల చరిత్రే. 1900 ప్రాంతంలో మైతేయీ మహిళలు బ్రిటీషు సామ్రాజ్యదోపిడికి వ్యతిరేకంగా పోరాడారు . ఆ తరువాత మూడు దశాబ్దాల అనంతరం కాంగ్లీ పాక్ సామ్రాట్ చేస్తున్న దౌర్జన్యాలకు, లైంగిక దాడులకు ,అణిచివేతలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసింది. ఈ తిరుగుబాట్లను నునుపిలాన్‌ లేదా మహిళా యుద్ధాలని పిలుస్తారు.

అంతేకాదు 2000 సంవత్సరంలో మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా లైంగిక దాడులకు వ్యతిరేకంగా మీరాపేబీస్‌ పోరాడింది. ఇంత సుధీర్ఘ పోరాటాల చరిత్ర ఉన్న మీరా పేబీస్‌ గత మూడు నెలల నుంచి కుకీ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో మైతేయీ మహిళల పాత్ర గురించి ప్రధాన చర్చగా మారింది. ఈ జర్నలిస్టు నలుగురు కుకీ మహిళను కలిసి వారిపై జరిగిన ఘటనల గురించి వివరాలు సేకరించారు.

రెండు ఘటనల్లో కుకీ మహిళల ప్రకారం మైతేయీ పురుషులతో పాటు సాయుధులై ఉన్న మహిళలు మా పై హింసకు పూనుకున్నారు. మమ్ములను పురుషుల మధ్యకు బలవంతంగా నెట్టి వేసి లైంగికదాడులు చేయమని ప్రేరేపిస్తున్నారు. హత్యలు చేయడానికి పురి కొలుపుతున్నారని వారు వాపోయారు. కుకీ గ్రామాలపై దాడుల్లోనూ, ఇళ్లు తగులబెట్టడంలో, పరిగెడుతున్న కుకీ మహిళలను వెంటాడి పట్టుకోవడం ,చిత్రహింసలకు గురి చేయడంలోనూ మైతేయీ మహిళలు చొరవ ప్రదర్శించారు.

వీటితోపాటు ఇంఫాల్ నుంచి ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు, జిల్లాలకు వెళ్లే హైవేలను మైతేయీ మహిళలు బ్లాక్ చేశారు. రోడ్లపై అడ్డంకులు సృష్టించి కుకీ బహుళ ఏరియాలు చురచాంద్ పూర్, కుంగ్ పాక్ లకు ఆహారం, మందులు బట్టలు ఇతర సరఫరాలు అందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొనేవారు . కుకీ పేషెంట్ల అంబులెన్సులనూ అడ్డుకొని వాటికి నిప్పంటించేవారు. సజీవ దహనాలకు పూనుకునేవారు.

ఆదేవిషయాలను ప్యారామిలటరీ అధికారులు కూడా మీరాపేబిస్ పై ఆరోపణలు చేశారు. మణిపూర్ లో శాంతికి భంగంగా ఆ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయన్నారు. హైవేలపై మా వాహనాలను ముందుకుపోనీకుండా ,అడ్డుకోవడం,మేము సాయుధ మైతేయీ మూకలను చుట్టిముట్టినప్పుడు ఈ మీరాపేబిస్ అడ్డుపడి వారిని కాపాడేందుకు రంగంలోకి దిగేదన్నారు.

మణిపూర్ లో జరుగుతున్న హింసలో మహిళల పాత్ర ,మీరాపేబిస్ పై ఆరోపణల గురించి అడిగినప్పుడు వారు ఆ విషయాలు బయటకు మాట్లాడటానికి నిజాలు చెప్పడానికి ఇష్టపడలేదు. కాని కుకీలే మే 3న తమపై దాడులకు దిగారని ఆరోపించారు. ఆత్మరక్షణ కోసమే తాము ప్రతిదాడులకు దిగామన్నారు. హింస ప్రారంభమైనప్పటి నుంచి మేం ఇండ్లకు, గ్రామాలకు దూరమై రోడ్లపైనే పోలీసుల డ్యూటీలు చేస్తున్నమన్నారు.

మైతేయీ మహిళలను ప్రత్యేకంగా కలిసిప్పుడు వారిలో కొందరి అసంతృప్తులు కూడా బయటడ్డాయి. మీర పేబీస్‌ మైతేయ ప్రతి కాలనీలో ఉన్న కిందిస్థాయి సంస్థ అని, దీనికి పెద్ద వయసున్న మహిళ అధికారి అని, అమె చెప్పిట్లుగా కాలనీ మహిళల వినాలని, మహిళలు గుమిగూడటానికి సిగ్నల్‌గా కరెంటు పోల్‌ పై శబ్దాల సంకేతాలు చేస్తారని, మేం చేస్తున్న పని వదిలి, వెంటనే వెళ్లాల్సి ఉటుందని, వెళ్లకపోతే గట్టి శిక్షలు ఉంటాయని, వారన్నారు. మొత్తం మీద మణిపూర్‌ లో జరుగుతున్న హింసాకాండలో మీరా పేబీస్‌ పాత్ర బలంగా ఉందనేది కాదనలేని వాస్తవం.