Manipur Violence | BJP చేత‌గాని త‌న‌నికి మణిపూర్ అల్ల‌ర్లు నిద‌ర్శ‌నం: బెల్లయ్య నాయక్

Manipur Violence బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాతే కుకీ , మైతేలీ తెగల మధ్య అతిపత్య పోరు 350 మంది ప్రజలను చంపేశారు, మహిళలను నగ్నగా రోడ్డుపై తిప్పుతున్నారు కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మనందం కూడా నవ్వుకుంటారు విధాత‌: మణిపూర్ అల్ల‌ర్ల‌పై కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ గాంధీ భ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. బీజేపీ ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం వ‌ల్లే 85 రోజులుగా మణిపూర్ మండుతోందని ఆరోపించారు. BJP […]

  • By: krs    latest    Jul 20, 2023 12:30 AM IST
Manipur Violence | BJP చేత‌గాని త‌న‌నికి మణిపూర్ అల్ల‌ర్లు నిద‌ర్శ‌నం: బెల్లయ్య నాయక్

Manipur Violence

  • బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాతే కుకీ , మైతేలీ తెగల మధ్య అతిపత్య పోరు
  • 350 మంది ప్రజలను చంపేశారు, మహిళలను నగ్నగా రోడ్డుపై తిప్పుతున్నారు
  • కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మనందం కూడా నవ్వుకుంటారు

విధాత‌: మణిపూర్ అల్ల‌ర్ల‌పై కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ గాంధీ భ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. బీజేపీ ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం వ‌ల్లే 85 రోజులుగా మణిపూర్ మండుతోందని ఆరోపించారు. BJP చేత‌గాని త‌న‌నికి మణిపూర్ నిదర్శనమ‌ని తెలిపారు. ఈ అల్ల‌ర్ల మూలంగా చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారన్నారు. అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాతే కుకీ , మైతేలీ తెగల మధ్య అతిపత్య పోరు, చర్చిల మధ్య కొట్లాటలు మొద‌లయ్యాయ‌ని బెల్ల‌య్య ఆరోపించారు. మైతేయి తెగను ఎస్టీ లో కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్ప‌టి నుంచి కుకీ తెగ అసంతృప్తితో రగులుతోందని ఆయ‌న పేర్కొన్నారు.

12 మంది BJP ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.. BJP డైరెక్షన్ లో ఈ ఆందోళన జరుగుతోందన్నారు. ఇప్పటికే 350 మంది ప్రజలను చంపేశారని, మహిళలను నగ్నగా రోడ్డుపై తిప్పుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదంతా జరుగుతున్న‌ప్పుడూ ప్రధాని మోడీ స్పందించలేదు. కానీ ఇప్పుడు మోడీ బాధాకరం అంటున్నారు. ఇదంతా BJP మణిపూర్ లో గెలవడానికి అనుసరించిన వ్యూహమ‌ని బెల్ల‌య్య ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది మాట్లాడకుండా ఇక్కడ డ్రామా చేస్తున్నారు. కేంద్రమంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారా .. అంత డ్రామా నే, బండి సంజయ్ కి క్రెడిట్ పోతుందని కిషన్ రెడ్డి అరెస్ట్ చేయించుకున్నారు. కిష‌న్‌రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు పోటీ పడి పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మనందం కూడా నవ్వుకుంటారని ఆయ‌న తెలిపారు. ఇదంతా BJP, BRS ఆడుతున్న డ్రామానేన‌ని, అవసరమైతే కవితను అరెస్ట్ చేస్తారు, KCR పై కూడా BJP కేసు పెట్టె ఛాన్స్ వుందని బెల్ల‌య్య నాయ‌క్ పేర్కొన్నారు.


ప్ర‌ధానీ మోడీ ఈ దేశంకోసమే పనిచేస్తున్నారా.. లేక పక్క దేశం కోసం పనిచేస్తున్నారా: ఎమ్మెల్యే సీతక్క

మణిపూర్ లో దారుణం జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌. 79 రోజుల తర్వాత ప్రధాని మాట్లాడడం బాధాకరమ‌న్నారు. గురువారం గాంధీభ‌వ‌న్‌లో మీడియా ముందు ఆమె మాట్లాడారు. ఇన్నిరోజులుగా మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు జరుగుతుంటే ప్ర‌ధానీ ఏం తెలియనట్లుగా చెబుతున్నారని సీత‌క్క మండిపడ్డారు. ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికి మాత్ర‌మే ప్ర‌ధానీ మోదీ మాట్లాడార‌ని ఆమె వెల్ల‌డించారు. మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంద‌ని సీత‌క్క తెలిపారు. కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరమ‌ని పేర్కొన్నారు. ఈశాన్యరాష్ట్రాలకు ఉన్న స్పెషల్ స్టేటస్ ను తొక్కిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంద‌న్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవని ఆరోపించారు. పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాకూడా మణిపూర్ సీఎం ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరమ‌ని సీత‌క్క‌ విచారం వ్య‌క్తం చేశారు. మోడీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాల కు ఇంచార్జి గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం లేదని ఆరోపించారు. గుజరాత్ లో మోడీ సీఎం గా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారు. BJP సర్కార్ రాజకీయం కోసమే తప్పా ప్రజల కోసం మానవత్వం కోసం పనిచేయడం లేదు. యునైటెడ్ ఇండియా టీమ్ కూడా మణిపూర్ కోసం పనిచేస్తుంది. మణిపూర్ లో జరిగే ఘటనలు బయటికి రావడం లేదు. ఆర్మీ, నెట్ వర్క్ అంతా బిజెపి చేతుల్లోనే ఉంది. మోడీ ఈ దేశంకోసమే పనిచేస్తున్నారా.. లేక పక్క దేశం కోసం పనిచేస్తున్నారా.. అని సీత‌క్క ప్ర‌శ్నించారు. మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి లేదంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.