Manipur Violence | మణిపూర్ ఘటన.. ఐద్వా నిరసనలు

Manipur Violence మణిపూర్ సీఎం రాజీనామాకు డిమాండ్‌ విధాత, నిజామాబాద్ ప్రతినిధిః మణిపూర్‌లో కుకీ తెగలపై సాగుతున్న హత్యాకాండ, మహిళలపై జరిగిన దాడులను నిరసిస్తు నిజామాబాద్ ఐద్వా మహిళా సంఘం కళ్లకు గంతలు కట్టుకుని, చేతులు బంధించుకుని జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దేశంలో BJP అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హత్యలు, హత్యాచారాలు, దాడులు లైంగిక వేధింపులు పెరిగిపోయాయన్నారు. […]

  • By: krs    latest    Jul 21, 2023 1:17 AM IST
Manipur Violence | మణిపూర్ ఘటన.. ఐద్వా నిరసనలు

Manipur Violence

  • మణిపూర్ సీఎం రాజీనామాకు డిమాండ్‌

విధాత, నిజామాబాద్ ప్రతినిధిః మణిపూర్‌లో కుకీ తెగలపై సాగుతున్న హత్యాకాండ, మహిళలపై జరిగిన దాడులను నిరసిస్తు నిజామాబాద్ ఐద్వా మహిళా సంఘం కళ్లకు గంతలు కట్టుకుని, చేతులు బంధించుకుని జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఐద్వా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దేశంలో BJP అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హత్యలు, హత్యాచారాలు, దాడులు లైంగిక వేధింపులు పెరిగిపోయాయన్నారు.

మహిళలు, ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలంటే పోరాటాలు చేస్తే తప్ప మార్పులు వచ్చే పరిస్థితి కనపడటం లేదన్నారు. మణిపూర్ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మహిళలు చైతన్యవంతులుగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని, మణిపూర్ నిందితులకు 24 గంటల్లో శిక్ష పడకపోతే BJP కార్యాలయాలను దేశవ్యాప్తంగా ముట్టడిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మణిపూర్‌లో కుకీ మహిళలపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు