మావోయిస్టుల కొత్త ఆయుధం.. బాటిల్ మందు పాతర టెక్నిక్

ములుగు జిల్లాలో పోలీసులు స్వాధీనం అగ్ర నేతలపై కేసు నమోదు మందు పాతరతో షాక్ తిన్న పోలీసులు అటవీ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ వణుకుతున్న గిరిజన పల్లెలు మావోయిస్టు(Maoist) పార్టీ తన సాయుధ దాడుల నైపుణ్యం పెంపొందించుకోవడంలో భాగంగా కొత్త కొత్త ప్రయోగాలకు తెరతీస్తోంది. పాత పద్ధతుల స్థానంలో కొత్త అనుకూల టెక్నిక్లను అమలు చేస్తోంది. ఈ మేరకు మందు పాతలను తమకు అణువుగా తీర్చిదిద్దుకునే క్రమంలో బాటిల్ మందు పాతరల ప్రయోగానికి ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. […]

మావోయిస్టుల కొత్త ఆయుధం.. బాటిల్ మందు పాతర టెక్నిక్
  • ములుగు జిల్లాలో పోలీసులు స్వాధీనం
  • అగ్ర నేతలపై కేసు నమోదు
  • మందు పాతరతో షాక్ తిన్న పోలీసులు
  • అటవీ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్
  • వణుకుతున్న గిరిజన పల్లెలు

మావోయిస్టు(Maoist) పార్టీ తన సాయుధ దాడుల నైపుణ్యం పెంపొందించుకోవడంలో భాగంగా కొత్త కొత్త ప్రయోగాలకు తెరతీస్తోంది. పాత పద్ధతుల స్థానంలో కొత్త అనుకూల టెక్నిక్లను అమలు చేస్తోంది. ఈ మేరకు మందు పాతలను తమకు అణువుగా తీర్చిదిద్దుకునే క్రమంలో బాటిల్ మందు పాతరల ప్రయోగానికి ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టే పోలీసులే లక్ష్యంగా ఈ బాటిల్ మందు పాతరను (Bottle Land mine) ప్రయోగించేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తుతానికి ములుగు జిల్లా పోలీసులు విఫలం చేశారు. అదే సమయంలో పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలపై కేసు నమోదు చేశారు. అడవి ప్రాంతంలో పోలీసుల కూంబింగును ముమ్మరం చేశారు.

విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టులు కొత్తరహా మందుపాతరను రూపొందించినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ములుగు, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలోని (venkatapur) వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్‌లో ఐఐడితో ఉన్న మందుపాతరను కూంబింగ్ చేస్తున్న ప్రత్యేక బలగాలు కనుగొన్నాయి.

సకాలంలో మందుపాతరను గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్ట్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్,మొలలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలు చంద్రన్న, దామోదర్, కనకాల రాజిరెడ్డి, మంగు, సుధాకర్‌ల పై వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఏటూరు నాగారం ASP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.

షాక్‌కు గురైన పోలీసులు(police)

అడవిలోకి కూంబింగ్ వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఈ కొత్త తరహా మందు పాతరను అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బీరు బాటిల్ మందుపాతర పోలీసులను విస్మయ పర్చినట్లు సమాచారం. ఇతరులకు ఎలాంటి అనుమానం రాకుండా అమర్చేందుకు ఈ మందుపాతర అనుకూలంగా మావోలు రూపొందించినట్లు అంచనా వేస్తున్నారు.

సరిహద్దుల్లో (Border) కూంబింగ్ ముమ్మరం

చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ గ్రామాలలో ప్రవేశించారనే సమాచారంతో స్పెషల్ పార్టీ, సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు అదే సమయంలో లోతట్టు అడవి ప్రాంతాలలో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు అనుమానితులను ప్రశ్నిస్తూ అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

పోలీసుల ముకుమ్మడి కూంబింగుతో సరిహద్దు గ్రామాల్లోని గిరిజనులు( traibal s)తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రానున్నది వేసవి కావడంతో మావోయిస్టులు తగిన రక్షణ చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పైచేయి సాధించేందుకు తనిఖీలు, సమిష్టి (coombing)కూంబింగులు చేపట్టి ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు.