ఏపీ మంత్రి, ఎమ్మెల్యేపై మావోయిస్టుల నజర్!
అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆరోపణ! విధాత: చాన్నాళ్ల తరువాత మావోయిష్టులు మళ్ళీ ఉనికిలోకి వచ్చారు. యథావిధిగా ప్రభుత్వంలోని బాధ్యులు అంటే మంత్రి.. ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ఓ ఏజన్సీలోని గిరిజన ఎమ్మెల్యేనూ నిందిస్తూ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి గణేష్ ఓ హెచ్చరిక లేఖ విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడున్నరేళ్ల పాలనలో అవినీతి, భూ కబ్జాలు తప్ప […]

అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆరోపణ!
విధాత: చాన్నాళ్ల తరువాత మావోయిష్టులు మళ్ళీ ఉనికిలోకి వచ్చారు. యథావిధిగా ప్రభుత్వంలోని బాధ్యులు అంటే మంత్రి.. ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ఓ ఏజన్సీలోని గిరిజన ఎమ్మెల్యేనూ నిందిస్తూ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి గణేష్ ఓ హెచ్చరిక లేఖ విడుదల చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడున్నరేళ్ల పాలనలో అవినీతి, భూ కబ్జాలు తప్ప అభివృద్ధి లేదని ఆ లేఖలో ఆరోపించారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదరి అప్పలరాజు పేరును పేర్కొంటూ. ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాల విలువైన భూములతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను కూడా ఒక ఎంపీ సాయంతో ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
ఈ భూములను ఒక కార్పొరేట్ కంపెనీకి వేల కోట్ల రూపాయలకు ధారాదత్తం చేస్తున్నారు అంటూ లేఖలో ప్రస్తావించడంతో కలకలం రేగుతోంది. ఈ భూములే కాకుండా పలాస నియోజ్కవర్గం పర్ధిలోని కాశిబుగ్గ – పలాస జంట పట్టణాలకు అందుబాటులో ఉన్న సూదికొండ – నెమలికొండలను కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకొని కోట్ల రూపాయల విలువ చేసే మట్టినీ రాళ్ళను అమ్ముకుంటున్నారని గణేష్ కన్నెర్ర చేశారు.
విశాఖలో ఏయూ భూములను కూడా చదును చేస్తామని చెప్పి మరీ భూకబ్జాలకు తెర తీశారని గణేష్ పేర్కొన్నారు. విశాఖ పర్యావరణానికి పెట్టింది పేరుగా ఉన్న రుషికొండ మీద అనధికార అక్రమ నిర్మాణాలు చేపడుతూ పర్యాటక శాఖ తన ఇష్టం వచ్చిన తీరున వ్యవహరిస్తోందని దీని ఎవరూ ప్రశ్నించకుండా కట్టడి చేయడం దారుణం అని అన్నారు.
ఏజెన్సీలో చూస్తే ఏకంగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ గిరిజన కుటుబ్మాల భూములను ఆక్రమించు కున్నారని ఇక రిసార్ట్స్ టూరిజం పేరిట వేలాది అటవీ భూములు గిరిజన భూములను ఆక్రమించు కుంటున్నారని గణేష్ మండి పడ్డారు. ఉత్తరాంధ్రా మొత్తం చూస్తే వైసీపీ నాయకుల భూ కబ్జాల కింద నలిగిపోతోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు(వైసీపీ) టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను ఇలాగే అవినీతి ఆరోపణలు చేస్తూ మావోయిష్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గణేష్ లేఖను చూసి ప్రజా ప్రతినిధులు కలవర పడుతున్నారు