Margadarshi Case | మార్గదర్శి కేసులో CID దూకుడు.. రామోజీకి షాక్.. రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్..
Margadarshi Case విధాత: రామోజీకి ఊహించని షాక్.. ఇన్నేళ్ల వ్యాపార.. రాజకీయ చాణక్యం నెరపిన ఆయన్ను ఇన్నాళ్లూ ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు.. కానీ సీఐడీ దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో అక్రమాలను చూపిస్తూ భారీగా ఆస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుని కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సీఐడి సోమవారం గట్టి నిర్ణయం తీసుకుంది.. రామోజీరావుకు సంబంధించి రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ […]

Margadarshi Case
విధాత: రామోజీకి ఊహించని షాక్.. ఇన్నేళ్ల వ్యాపార.. రాజకీయ చాణక్యం నెరపిన ఆయన్ను ఇన్నాళ్లూ ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు.. కానీ సీఐడీ దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో అక్రమాలను చూపిస్తూ భారీగా ఆస్తులు అటాచ్ చేసింది.
మార్గదర్శి కేసుని కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సీఐడి సోమవారం గట్టి నిర్ణయం తీసుకుంది.. రామోజీరావుకు సంబంధించి రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోర్ మెన్ ఆడిటర్ లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది.
మార్గదర్శి బ్రాంచిల్లో చిట్ల ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆఫీస్ కు తరలించి వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. ఇలా నిధుల బదలాయింపు చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధమని సీఐడీ అభియోగం.
దీనివల్ల మార్గదర్శి లో నిధుల కొరత ఏర్పడి చిట్స్ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా డబ్బులు ఇవ్వడం లేదని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నామని తెలిపింది. ఇది రామోజీ రావుకు ఊహించని పరిణామం.