Medak
విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం లో సీఎం కెసిఆర్ ప్రభుత్వ వైపల్యా లను గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ కార్యకర్తలు వివరించాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఏడుపాయల వన దుర్గా మాతను దర్శించుకున్నారు. మాచారం గ్రామంలో ఆదర్శ రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న ముర హరి రావు నివాసంలో అల్పాహారం చేశారు. అనంతరం స్టేడియంను సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు.
హవేలీ ఘనపూర్ మండలంలో ఇంటింటికి మోడీ సంక్షేమ పథకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెదక్ డాక్టర్ లతో సమావేశం అయ్యారు. డాక్టర్ విజయ్ కుమార్ నివాసంలో కేంద్ర మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన గడపగడపకు వివరించాలని పార్టీ ముఖ్య కార్యకర్తలను నాయకులను కోరారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికునిగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన గడప గడపకు వివరించాలని కేంద్ర మంత్రి కోరారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ కన్వీనర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా రాష్ట్ర మండల గ్రామ కమిటీ లో ఉన్న ముఖ్య నాయకులు సమన్వయంతో పనిచేసి బిజెపి ప్రభుత్వం ఏర్పడే విధంగా పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర జిల్లా బాధ్యులు గ్రామాలలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో బూత్ కమిటీలు యాక్టివ్ గా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర, జిల్లాల, బాధ్యులు బూత్ కమిటీలకు సహకరించాలని కోరారు.
అథ్లెటిక్ సెంటర్ ను మెదక్ స్టేడియం కు తిరిగి తీసుకురావాలి. మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం సమయంలో హైదరాబాద్ కు తరలించిన అథ్లెటిక్ సెంటర్ ను మెదక్ తిరిగి తీసుకురావాలని కేంద్ర మంత్రి రూపాలను మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు టిపిటిఎఫ్ మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఎంఎల్ఎన్ రెడ్డి, పిఈటీలు,క్రీడాకారులు కేంద్ర మంత్రికి వివరించారు.
స్టేడియం ను సందర్శించి, క్రీడాకారులతో ముఖాముఖి మాట్లాడారు. ఏడుపాయలలో ఈఓ సార శ్రీనివాస్ అధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శంకర శర్మ ప్రత్యేక పూజలు చేసి మంత్రిని ఆశీర్వదించారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, న్యాయవాది రాజశేఖర్, కరణం పరిణితి, సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, నందా రెడ్డి, రాంచ రణ్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.