మెదక్: భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి: ఎమ్మెల్యే రాజా సింగ్
శివాజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శివాజీ ఆశయ సాధన కోసం యువత ముందుందాలి ఆకట్టుకున్న శోభా యాత్ర విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో శివాజీ భారీ కాంస్య విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, కమలానంద భారతి స్వామి చేతులమీదుగా ఆవిష్కరించారు. శివాజీ పోరాటాలు తెలిసేలా […]

- శివాజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
- జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
- శివాజీ ఆశయ సాధన కోసం యువత ముందుందాలి
- ఆకట్టుకున్న శోభా యాత్ర
విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో శివాజీ భారీ కాంస్య విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, కమలానంద భారతి స్వామి చేతులమీదుగా ఆవిష్కరించారు.
శివాజీ పోరాటాలు తెలిసేలా పుస్తకాలు: కమలానంద భారతీస్వామి
మెదక్ పట్టణం నడిబొడ్డున భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మంగళవారం రాత్రి ఆశేష జనవాహిని తరలిరాగా.. ఛత్రపతి శివాజీ జయ జయ ధ్వానాల మధ్య అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ కలలో వచ్చిన వీరుడు శివాజీ అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ విద్యా విధానంలో దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో శివాజీ పోరాటాలు తెలిసేలా పుస్తకాలు తయారవుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశం సుఖంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతుందని తెలిపారు.
శివాజీ ఆశయాలు కొనసాగించాని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీగా మారాలని పిలుపునిచ్చారు. శివాజీ విగ్రహాలు ఏర్పాటుతోపాటు ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని, యువత శివాజీ ఆశయాలు కొనసాగించాలనీ పిలుపు నిచ్చారు. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని,ముఖ్యంగా శివాజీ జీవిత చరిత్రను చిన్న పిల్లకు చెప్పి భావితరాలకు అందించే విధంగా అందరం కృషి చేయాలన్నారు.
ఆదర్శప్రాయుడు శివాజీ: ఎమ్మెల్యే పద్మ
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించిన ఆదర్శప్రాయుడు శివాజీ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. శివాజీ ఓ గొప్ప ధీరుడు పరాక్రమవంతుడు అన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ మనదేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరము గర్వపడాలన్నారు.
ఆకట్టుకున్న శోభా యాత్ర..
పట్టణంలో ధ్యాన్‌చంద్ విగ్రహం నుంచి ప్రారంభమైన శోభా యాత్ర శివాజీ విగ్రం వరకు సాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రాజా సింగ్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు మాయ శంకర్, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, నాయిని ప్రసాద్ చెన్నా రామచంద్రం, నరసరావుపేట గోల నాగభూషణం సత్యనారాయణ, విగ్రహ దాతలు పాల్గొన్నారు.