తెలంగాణ బడ్జెట్‌లో బుద్ధ వనం ప్రస్తావన హర్షణీయం: మల్లేపల్లి లక్ష్మయ్య

విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం నిర్మాణం ప్రస్తావన ఉండడంపై బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లిందనీ, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించి 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును […]

  • Publish Date - February 6, 2023 / 05:09 PM IST

విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం నిర్మాణం ప్రస్తావన ఉండడంపై బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు.

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లిందనీ, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించి 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును రూ.71 కోట్లతో అభివృద్ధి చేసిందన్నారు.

అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, ఇతర పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నదని ప్రస్తావించారు. దీనిపై మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో బుద్ధవనంపై ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.