మోటార్లకు మీటర్లు.. బండి చెప్పేవి అవాస్తవాలు: మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత: వ్యవసాయ(Agricultural) విద్యుత్ కనెక్షన్ మోటర్ల(Motors)కు మీటర్లు బిగించే విషయంపైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) దుయ్యబట్టారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధన అవాస్తవమంటూ బండి సంజయ్(Bandi Sanjay) రాష్ట్ర ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే 0.5 % ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పెంచుతామని కేంద్రం చేసిన నిబంధనలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాను స్పష్టంగా అసెంబ్లీలో […]

విధాత: వ్యవసాయ(Agricultural) విద్యుత్ కనెక్షన్ మోటర్ల(Motors)కు మీటర్లు బిగించే విషయంపైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) దుయ్యబట్టారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధన అవాస్తవమంటూ బండి సంజయ్(Bandi Sanjay) రాష్ట్ర ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మోటార్లకు మీటర్లు బిగిస్తే 0.5 % ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పెంచుతామని కేంద్రం చేసిన నిబంధనలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాను స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటన చేశామన్నారు. కానీ బండి సంజయ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రానికి లేఖ రాసిందంటూ అబద్ధాలు చెబుతున్నారన్నారు.
మోటార్లకు మీటర్ల నిబంధనపై తాము శాసనసభలో అబద్దాలు చెబితే తమపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారంటూ హక్కుల తీర్మానం పెట్టవచ్చు కదా అన్నారు. బండి సంజయ్ ఆరోపిస్తున్నట్లుగా ఆయనకు దమ్ముంటే కేంద్ర మంత్రితో మోటార్లకు మీటర్లు పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చినట్లుగా చెప్పించాలని నిలదీశారు. గుజరాత్‌లో రైతు మోటార్లకు మీటర్లు ఉన్నాయని చెబితే, ఉచిత విద్యుత్ లేదంటే బీజేపీ నాయకులు ఒక్క మాట మాట్లాడారన్నారు.
— Jagadish Reddy G (@jagadishBRS) February 21, 2023
దేశ ప్రజలపై కక్ష పూని తన మిత్రులు ఆదానీ(Adani), అంబానీ(Ambani)లకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం దేశంలో సింగరేణి వంటి సంస్థల నుండి 3600కే బొగ్గు లభిస్తున్నప్పటికీ 30 వేలు పెట్టి విదేశీ బొగ్గును కొనాలంటూ ఆంక్షలు విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. విదేశీ బొగ్గు తీసుకువచ్చి మన విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిందే అంటూ కేంద్రం ఒత్తిడి చేస్తుందన్నారు.
ఆదానీ విద్యుత్ సంస్థల నుండి యూనిటీ 50 రూపాయలకు కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తుందన్నారు. సంజయ్ చెబుతున్నట్లుగా పారిశ్రామికవేత్తలే 50 రూపాయలకు కొనుగోలు చేస్తే చేస్తే దాని ప్రకారం వారు తమ ఉత్పత్తులపై రేట్లు పెంచి ప్రజలపై భారం వేస్తారు కదా అన్నారు.
మన ఇంట్లో బియ్యం ఉన్నా సరే ఒక పూట మీరు బయట నుండి కొనుక్కోవాలంటు ఒత్తిడి చేయడం ఏం దేశభక్తి అంటు జగదీష్ రెడ్డి విమర్శించారు. విదేశీ బొగ్గు కొనుగోలులో మతలబు ఏమిటో ఆదానీకి, ప్రధాని మోడీకే తెలవాలి అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్రం నిబంధన అవాస్తమైతే తెలంగాణకు ఏటా 6000 కోట్ల చొప్పున ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) కింద 30 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.
కేంద్ర విద్యుత్ విధానాలపై బూత్ స్థాయి నాయకుడు సంజయ్ కి తెలవకపోతే పార్లమెంటు(Parliament)లో కేంద్ర మంత్రుల్ని అడిగి తెలుసుకోవాలన్నారు. ఆదానీ, అంబానీల కోసం మోడీ(Modi) ప్రభుత్వం చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి త్వరలోనే ప్రజలు బిజెపికి బుద్ధి చెప్తారు అన్నారు.