బీజేపీ పొత్తును మేం నిరాకరించాం: మంత్రి కేటీఆర్

  • Publish Date - October 4, 2023 / 09:28 AM IST

విధాత: బీజేపీ నుంచి 2018 ఎన్నికల్లో అప్పటి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన పొత్తు ప్రతిపాదనను బీఆరెస్ తిరస్కరించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కోన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరు సభలో సీఎం కేసీఆర్ ఎన్డీఏలో చేరుతామని కోరగా తాను తిరస్కరించినట్లుగా చెప్పిన వ్యాఖ్యలకు కౌంటర్‌లో మంత్రి కేటీఆర్ మరోసారి ట్వీట్‌లో స్పందించారు.


బీజేపీ ఢిల్లీ బాస్‌ల అనుమతితోనే లక్ష్మణ్ ఆ ప్రతిపాదన చేసి ఉంటారని, తాము వెంటనే బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించామని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కోన్నారు. 105స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కని ఆ పార్టీతో బీఆరెస్ ఎందుకు కలస్తుందని, తాము పోరాడేవాళ్మే తప్ప మోసం చేసే వాళ్లం కాదని ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.


రాష్ట్ర అవిర్భావం తర్వాతా బీఆరెస్‌తో కలిసి పనిచేసేందుకు ఎన్నో పొత్తు ప్రతిపాదనలు వచ్చాయని, కాని కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని, అదే సమయంలో విపక్షాలు మాత్రం సిద్దాంతాలను పక్కన పెట్టి పొత్తులు పెట్టుకుని కేసీఆర్‌ను ఓడించేందుకు కలసి పనిచేశారని కేటీఆర్‌ విమర్శించారు.