Minister KTR | 100 అబద్ధాల బీజేపీ సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR | విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆరెస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన 100అబద్ధాల సీడీని, బుక్ లెట్‌ను బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఉద్యోగాల కల్పన, జీఎస్టీ భారం, ప్రతి ఇంటికి ఇంటర్నేట్‌, అందరికి ఇళ్లు, రాష్ట్ర విభజన చట్టం హామీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదిలాబాద్ సీసీఐ వాల్మికీ, బోయలకు […]

  • By: Somu    latest    Aug 14, 2023 12:59 PM IST
Minister KTR | 100 అబద్ధాల బీజేపీ సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR | విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆరెస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన 100అబద్ధాల సీడీని, బుక్ లెట్‌ను బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

ఉద్యోగాల కల్పన, జీఎస్టీ భారం, ప్రతి ఇంటికి ఇంటర్నేట్‌, అందరికి ఇళ్లు, రాష్ట్ర విభజన చట్టం హామీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదిలాబాద్ సీసీఐ వాల్మికీ, బోయలకు ఎస్టీ రిజర్వేషన్ల హామీల వైఫల్యాలను ప్రశ్నిస్తు సీడీని రూపొందించారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వ హామీలతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీల అంశాలను కూడా సీడీలో పొందుపరిచారు. 100అబద్ధాల బీజేపీ సీడీ రూపకల్పనకు కృషి చేసిన పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు.