Viral Video | ప్రియుడిపై కోపంతో.. 80 అడుగుల హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌రెక్కిన బాలిక‌

Viral Video | ప్రేమికుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మే. గొడ‌వ‌ల కార‌ణంగా మాట్లాడుకోవ‌డం మానేస్తారు. అస‌లు క‌లుసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. చేసేదేమీ లేక ఎవ‌రో ఒక‌రు మ‌ళ్లీ బుజ్జ‌గింపులకు దిగుతారు. అలా మళ్లీ మాట‌లు క‌లుస్తాయి. ప్రేమ‌నురాగాలు కురిపిస్తారు. అయితే ఓ యువ‌తి మాత్రం.. త‌న ప్రియుడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌రెక్కింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మార్వాహి జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక […]

Viral Video | ప్రియుడిపై కోపంతో.. 80 అడుగుల హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌రెక్కిన బాలిక‌

Viral Video |

ప్రేమికుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మే. గొడ‌వ‌ల కార‌ణంగా మాట్లాడుకోవ‌డం మానేస్తారు. అస‌లు క‌లుసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. చేసేదేమీ లేక ఎవ‌రో ఒక‌రు మ‌ళ్లీ బుజ్జ‌గింపులకు దిగుతారు. అలా మళ్లీ మాట‌లు క‌లుస్తాయి.

ప్రేమ‌నురాగాలు కురిపిస్తారు. అయితే ఓ యువ‌తి మాత్రం.. త‌న ప్రియుడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌రెక్కింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మార్వాహి జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉన్న ఓ యువ‌కుడిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తోంది. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఇటీవ‌లే ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ గొడ‌వ ప‌డింది. దీంతో ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌ర్ ఎక్కింది ఆ బాలిక‌. ఆమెను బుజ్జ‌గించేందుకు ప్రియుడు కూడా ఆ విద్యుత్ ట‌వ‌ర్ ఎక్కాల్సి వ‌చ్చింది.

స్థానికులంతా అక్క‌డికి చేరుకుని, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, ఆ ప్రేమికుల‌కు న‌చ్చ‌జెప్పి కింద‌కు దించారు. మ‌ళ్లీ ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డొద్ద‌ని వారిద్ద‌రిని పోలీసులు మంద‌లించి వ‌దిలేశారు. ప్రేమికులిద్ద‌రూ విద్యుత్ ట‌వ‌రెక్కిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.