మా దెబ్బతో సీఎం ప్రజాభవన్‌కు: హరీశ్‌రావు
ప్రజాభవన్‌లో ప్రజలను కలిసే విషయమై తాము అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయడంతోనే శుక్రవారం ఆయన ప్రజాభవన్‌కు వెళ్లారని మాజీమంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు

విధాత, హైదరాబాద్ : ప్రజాభవన్‌లో ప్రజలను కలిసే విషయమై తాము అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయడంతోనే శుక్రవారం ఆయన ప్రజాభవన్‌కు వెళ్లారని మాజీమంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన హరీశ్‌రావు ప్రతిరోజూ ప్రజాభవన్‌కు వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లారన్నారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో తాము ఆధారాలతో సహా నిలదీశామన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి ప్రజాభవన్‌కు వెళ్లారన్నారు. నిజానికి ఒక రోజు ముందుగా సీఎం ప్రజాభవన్‌కు వస్తారని సమాచారం ఇచ్చి ఉంటే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారని హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్షంగా తాము సీఎం హామీలను అమలు చేయించడంలో ఇదే స్ఫూర్తితో ముందుకెలుతామన్నారు.